Famous Movie Tree: సాధారణంగా చెట్టు చిగురించడం అనేది ఒక ప్రక్రియ. అన్నిచోట్ల ఇది కనిపించే సహజ ప్రక్రియ కూడా. కానీ గోదావరి జిల్లాలో ఆ చెట్టు చిగురించేసరికి స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆ చెట్టును చూసి మురిసిపోతున్నారు స్థానికులు. ఇంతకీ ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. అది సినిమాల చెట్టు. దాదాపు 300కు పైగా సినిమాల్లో కనిపిస్తుంది ఆ చెట్టు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార దేవంలో ఈ చెట్టు ఉంది. అయితే ఈ చెట్టు గతేడాది భారీ వర్షాలు, వరదలకు కూలిపోయింది. కానీ ఇప్పుడు అదే చెట్టు మళ్ళీ చిగురించింది. కానీ మధ్యలో చాలా రకాల ప్రయత్నాలు జరగడంతోనే.. యధా స్థానానికి వచ్చింది. మళ్లీ సినిమాల షూటింగ్ లతో కలకలలాడుతోంది.
Also Read: త్రీడీ టెక్నాలజీతో అమరావతి!
సుదీర్ఘ చరిత్ర..
గోదావరి( Godavari river) ఒడ్డున ఉంటుంది ఈ చెట్టు. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర దీని సొంతం. నిద్ర గన్నేరు చెట్టుగా పిలవబడి ఈ వృక్షం కింద దాదాపు 300 చిత్రాల షూటింగ్ జరిగింది. ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వారికి ఈ చెట్టు చాలా ఇష్టం. గత ఏడాది వరదల కారణంగా చెట్టు రెండుగా చీలిపోయింది. నేల కూలడంతో స్థానికులు ఎంతో బాధపడ్డారు. దీంతో రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఘన చరిత్ర కలిగిన ఈ చెట్టును సంరక్షించే పనిలో పడింది. బతికించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. వేర్లు, కొమ్మలను కత్తిరించి రసాయన మిశ్రమాలు పూశారు. గాలి, ధూళి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు తరువాత కొద్ది రోజులకు చెట్టు కాండం, కొమ్మల భాగాల్లో పచ్చని చిగుళ్ళు వచ్చాయి. ఆ తరువాత చెట్టు ఏపిగా పెరిగింది.
Also Read: రోడ్డుమీద ఆమె డ్యాన్స్ వేసింది.. ఆ వీడియో ఇప్పుడు వైరల్.. దాని వెనుక పెద్ద కథ
ఇబ్బంది పెట్టిన ఎలుకలు..
అయితే ఈ చెట్టు పెరిగే క్రమంలో ఎలుకల బాధ తప్పలేదు. ఇలా మొలకలు రాగానే ఎలుకలు తినేసేవి. దీంతో ముగ్గురు వ్యక్తులు నిరంతరం అక్కడే ఉండి రసాయనాలు చల్లుతూ మొలకలను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తరువాత జాగ్రత్తలు తీసుకోవడంతో చెట్టు ఇప్పుడు పది అడుగుల ఎత్తు వరకు పెరిగింది. ఎంతో చరిత్ర ఉన్న ఈ చెట్టు బతికేసరికి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్, గ్రీన్ భారత్ వనం మనం విభాగం అభినందనలు అందుకుంటోంది. ముఖ్యంగా రేకపల్లి దుర్గాప్రసాద్ కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ చెట్టును సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. మొత్తానికి అయితే సినిమా చెట్టు నిలబడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.