గన్నవరం నియోజకవర్గానికి అన్నీ తానేనని ప్రకటించుకున్న ఎమ్మెల్ల్యే వల్లభనేని వంశీ మోహన్ కు వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట వంశీ గన్నవరానికి ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జి అన్నీ తానేనని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనతో దుట్టా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గన్నవరానికి ఎనికలు జరిగితే తాను పోటీ చేయడం నూరు శాతం గ్యారంటీ అని స్పష్టం చేశారు. వైసీపీ స్ధాపించిన నాటి నుంచి జెండా మోసిన తనకు పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని వంశీతో కలిసిన పని చేయలేనని చెప్పారు.
Also Read : కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?
ఇదే సమయంలో ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారని, అయితే లోపల జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరారని అన్నారు. అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావుపైనా కొన్ని విమర్శలు చేశారు. 2019లో పార్టీ ఆదేశాల ప్రకారం వెంకట్రావు గెలుపునకు కృషి చేశారని, ఆయన తనను దూరం పెట్టి, సహకార సంఘాల ఛైర్మన్ ల ఎంపీకలో ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. వంశీతో కలిపి పని చేయడానికి పార్టీ ఆదేశాలతో సిద్ధమయ్యానని, అయితే వంశీ తన వెంట వైసీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ అసైన పార్టీ నాయకులను, కార్యకర్తలను విస్మరించారని తెలిపారు.
కొద్ది రోజులుగా గన్నవరం నుంచి దుట్టా అల్లుడు భరత్ గన్నవరం ఇన్ఛార్జిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. దుట్టా మాత్రం ఈ వాదనలు ఖండించారు. తన అల్లుడుకి స్వఛ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించనున్నట్లు తెలిపారు. గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గన్నవరం ఇన్ఛార్జిగా యార్లగడ్డ రంగంలోకి దిగిన అనంతరం వైసీపీలో దుట్టా వర్గం, యార్లగడ్డ వర్గం ఉన్నాయి. ఇప్పడు వల్లభనేని వంశీ పార్టీలో చేయడంతో మూడు వర్గాలుగా మారాయి. స్వతహాగా వైసీపీలో ఉన్న వారికి వల్లభనేని ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం వాస్తవం. దీంతో దుట్టా కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరిగితే తానే పోటీ చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read : ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?
దుట్టా చర్యతో పార్టీ ప్రకటించకుండా స్వయంగా తానే వైసీపీ ఇన్చార్జినని ప్రకటించుకున్న వంశీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసంతృప్తితో ఉన్న దుట్టాతో సంప్రదింపులు జరపకుండా స్వయంగా తనకు తానే ఇన్ఛార్జిని అని ప్రకటించుకోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.