https://oktelugu.com/

బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

సినీ గాన గంధర్వుడు కరోనాని జయించారు. కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించనున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నన్నాగారికి కోవిడ్ -19 టెస్ట్ లో నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. మరో 3, 4 రోజుల్లో ఐసియు నుండి జనరల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 24, 2020 / 01:28 PM IST
    Follow us on

    సినీ గాన గంధర్వుడు కరోనాని జయించారు. కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించనున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నన్నాగారికి కోవిడ్ -19 టెస్ట్ లో నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.

    మరో 3, 4 రోజుల్లో ఐసియు నుండి జనరల్ వార్డుకు ఆయనను షిఫ్ట్ చేయనున్నారు. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం కుదటపడుతూ ఉంది. ఆయన కోసం ప్రార్ధనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు.

    Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

    మొత్తానికి బాలుగారికి కోవిడ్ నెగిటివ్ రావడంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా బాలుగారు ఆరోగ్యం పై ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకరంగా గురవుతున్న సంగతి తెలిసిందే. కానీ నేటితో వారి ఆందోళన తీరింది. బాలుగారు పూర్తిగా కోలుకోబోతున్నారు. ఇప్పటికే బాలుగారి ఆరోగ్యం పై ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్ధనలతో పాటు అలాగే లక్షలాది అభిమానులు బాలుగారి ఆరోగ్యం కోసం చేసిన పూజలను ఆ దేవుడి ఆలకించాడు. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో కరోనాని జయించారు. సంగీత ప్రపంచానికి ఇది ఎంతో శుభవార్త. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులను కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి.

    Also Read : పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !