రమేష్… ఈ పేరు చెబితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతోంది. అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు, విజయవాడ రమేష్ ఆస్పత్రి అధినేత…. డాక్టర్ రమేష్ కావచ్చు. ఇక వీరిద్దరిలో డాక్టర్ రమేష్ ఆచూకీ దొరకడం లేదు. దాంతో పోలీసులు అతని ఆచూకీ చెబితే లక్ష రూపాయల బహుమతి ప్రకటించేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు డాక్టర్ రమేష్ బాబు.
ఇక ఈ కేసులో కులపరమైన ఆరోపణలు ఎన్నో వచ్చాయి. వీటికి అనవసరంగా హీరో రామ్ పోతినేని స్పందించగా ఆయనకు పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు అనుకోండి… అది వేరే విషయం. అయితే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రమేష్ కుమార్ ని చంద్రబాబే దాచారని అనుమానం వ్యక్తం చేశారు. అతని ఆరోపణ వెనుక బలమైన కారణం ఉందో లేదో తెలియదు కానీ…. ఈ కేసులో కి చంద్రబాబుని కూడా లాగాలని నిర్ణయించుకున్నారు. బహుశా అదే విజయసాయిరెడ్డి ఉద్దేశ్యం అయి ఉండొచ్చు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రభుత్వం తమదే కాబట్టి.. ఈ విషయం లో విజయసాయి రెడ్డి ఇంకాస్త చొరవ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం…. న్యాయస్థానాలను ఆశ్రయించడం చేయవచ్చు. కాదంటే ప్రభుత్వం తరఫున చంద్రబాబు మీద విచారణ కమిటీ కూడా వేయించే ఆస్కారం ఆయనకు ఉంది. అయితే అవన్నీ మానేసి విజయసాయిరెడ్డి వేరే తరహాలో భారీ ట్వీట్ చేశారు.
https://twitter.com/VSReddy_MP/status/1297760457525100545?s=20
ఇకపోతే చంద్రబాబు నిజంగానే రమేష్ ను దాచేస్తే అది పసిగట్టలేని అసమర్ధత స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా..? విజయసాయిరెడ్డి నేరుగా ఇంతకీ డాక్టర్ రమేష్ ని ఇంట్లో దాచారా..? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా అని అడగడం…. నిమ్మగడ్డ రమేష్ కి – డాక్టర్ రమేష్ కు.. మీకు (చంద్రబాబుకి) ఎటువంటి సంబంధం ఉంది అని ప్రశ్నించడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. మరి దీనికి దీనికి బాబు నుండి కౌంటర్ ఆశించవచ్చా…?