https://oktelugu.com/

BJP protest బీజేపీ నేతలపై దాడులను ఖండించిన దుగ్యాల

BJP protest : బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి.. ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్య బృందం సహాయంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి యువమోర్చా రాష్ట్ర ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. భానుప్రకాష్ తో సహా పలువురు బిజెపి యువ మోర్చా నాయకులకు గాయాలై ఆస్పత్రులలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2023 10:26 pm
    Follow us on

    BJP protest : బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి.. ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్య బృందం సహాయంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి యువమోర్చా రాష్ట్ర ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు.

    భానుప్రకాష్ తో సహా పలువురు బిజెపి యువ మోర్చా నాయకులకు గాయాలై ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం చేపట్టిన బిజెపి యువమోర్చా నాయకులపై పోలీస్ యంత్రాంగం కర్కశంగా లాఠీచార్జ్ చేసి గాయాలపాలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు.

    అభ్యర్థుల యొక్క న్యాయమైన డిమాండ్లపై నిరసన కార్యక్రమం చేపట్టడం నేరం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. నిరసన కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దాష్టీకాన్ని ప్రదర్శించడం తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉన్నదన్న విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలని దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు.

    గతంలో ముఖ్యమంత్రి స్వయంగా పత్రికా విలేకరుల సమావేశంలో నిరసన కార్యక్రమాలు చేపడితే శాంతియుతంగా అరెస్టు చేయడం వదిలిపెట్టడం సర్వసాధారణం అన్న ముఖ్యమంత్రి నేడు నిరుద్యోగ యువతపై, రాజకీయ పార్టీల నాయకులపై పోలీసులను ప్రోత్సహించి లాఠీలతో దాడులు చేయించడం ఆయన అహంకారానికి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు.

    జరిగిన అన్యాయం పట్ల యువత, రాజకీయ పార్టీలు పోరాటాలను ఉద్యమాలను చేపడితే దాడులతో గాయపరచడం భయాందోళనకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సర్వసాధారణమైందన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి నియంతలు, నిరంకుశ వాదులు నేలమట్టమైనట్టే రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆగ్రహజాలల్లో నేలమట్టమవుతుందని అన్నారు..

    ‘ముఖ్యమంత్రి దాష్టీకాల పైన ప్రజల్లోకి వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి పైన ప్రజా వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలను, పోరాటాలను భారతీయ జనతా పార్టీ తీవ్రతరం చేస్తుంది. దాడులకు భయపడేది లేదన్నారు. పోలీసులను ప్రోత్సహించి లాఠీలతో దాడులు చేయించి రాక్షసానందాన్ని పొందుతున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు.’ అని దుగ్యాల ప్రదీప్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.