https://oktelugu.com/

దుబ్బాక: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత?

దుబ్బాక బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆదివారం కోర్ కమిటీ సమావేశంలో సిద్దిపేట డీసీసీ తూంకుంట నర్సిరెడ్డి పేరును సూత్రప్రాయంగా ఖరారు చేశారు. ఈ మేరకు మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో ఆయనే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి అని అంతా భావించారు. కానీ సడన్ గా కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా చక్రం తిప్పారు. Also Read: కేసీఆర్ సై..తొడగొడితే పడగొడుతాడట […]

Written By: NARESH, Updated On : October 7, 2020 10:29 am
Follow us on

Dubaka Elections

దుబ్బాక బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆదివారం కోర్ కమిటీ సమావేశంలో సిద్దిపేట డీసీసీ తూంకుంట నర్సిరెడ్డి పేరును సూత్రప్రాయంగా ఖరారు చేశారు. ఈ మేరకు మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో ఆయనే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి అని అంతా భావించారు. కానీ సడన్ గా కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా చక్రం తిప్పారు.

Also Read: కేసీఆర్ సై..తొడగొడితే పడగొడుతాడట

కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా చివరి నిమిషంలో దుబ్బాకకే చెందిన దివంగత మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదించారు. ఆయనకు నియోజకవర్గంలో పరపతి ఉందని.. ముత్యంరెడ్డి అనుచరగణం తోడుగా ఉందని.. ఓటు బ్యాంకు భారీగా ఉందని దామోదర్ వివరించారు. పైగా మల్లన్న సాగర్ బాధితుల పక్షాన తాను చేసిన పోరాటంలో శ్రీనివాసరెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్టు కూడా దామోదర్ వివరించారు. దామోదర్ రాజనర్సింహా వేగంగా పావులు కదిపి అందరినీ ఒప్పించారు.

Also Read: ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

ఈ క్రమంలోనే 2023లో కూడా దుబ్బాక టికెట్ ఇస్తే టీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లో చేరుతానని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్తమ్, కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పడంతో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు శ్రీనివాసరెడ్డి.

దీంతో దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలవబోయే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖారారైంది. బుధవారం శ్రీనివాసరెడ్డి పేరును అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు సమాచారం.