https://oktelugu.com/

కేసీఆర్ సై..తొడగొడితే పడగొడుతాడట!

‘కంటపడ్డావా.. కనికరిస్తానేమో…’ కానీ వెంట పడ్డావా? వేటాడేస్తా’ అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఈ పంచ్ డైలాగ్ ను ఇప్పుడు అక్షరాల పాటించేస్తున్నారు సీఎం కేసీఆర్.. అవును తమ్ముడు (సీఎం జగన్) తమ్ముడే.. పేకాట పేకాటే అంటూ నీళ్ల విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కాస్త గట్టిగానే కేసీఆర్ నిలబడ్డారని చెప్పొచ్చు. Also Read: దుబ్బాక: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి వాటాలో తీవ్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 08:51 AM IST
    Follow us on

    ‘కంటపడ్డావా.. కనికరిస్తానేమో…’ కానీ వెంట పడ్డావా? వేటాడేస్తా’ అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఈ పంచ్ డైలాగ్ ను ఇప్పుడు అక్షరాల పాటించేస్తున్నారు సీఎం కేసీఆర్.. అవును తమ్ముడు (సీఎం జగన్) తమ్ముడే.. పేకాట పేకాటే అంటూ నీళ్ల విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కాస్త గట్టిగానే కేసీఆర్ నిలబడ్డారని చెప్పొచ్చు.

    Also Read: దుబ్బాక: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత?

    ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీటి వాటాలో తీవ్ర అన్యాయం జరిగిందనేది తెలిసిందే. కృష్ణా జలాలు ఎక్కువగా ఆంధ్రాకు పారాయి.. గోదావరి కృష్ణాపై తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్క ప్రాజెక్టును కూడా ఆంధ్రా పాలకులు కట్టలేదు.. తెలంగాణ భూములకు నీళ్లు పారించలేదు.  ఈ అసంతృప్తి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. అదే ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ఏపీ తాజాగా రాయలసీమకు నీటిని తీసుకుపోతానంటే ఊరుకుంటాడా? ఊరుకోవడం లేదు. జగన్ తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా సరే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడబోనని కేసీఆర్ తేల్చిచెప్పడం విశేషం.

    దిగువన ఉన్న ఏపీ రాష్ట్రం దూకుడుగా రాయలసీమ ఎత్తిపోతల పేరుతో ముందుకు వేస్తుంటే.. అసలు ఎగువన ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఊరుకుంటాడా? అసలు శ్రీశైలం నుంచి ఎత్తిపోయడానికి వీల్లేకుండానే దానికి ముందే అడ్డంగా ప్రాజెక్టును  కడుతానంటూ తాజాగా హెచ్చరికలు పంపడం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనమైంది.

    Also Read: కేంద్రం అలర్ట్.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి..!

    అపెక్స్ కౌన్సిల్ భేటి సందర్భంగా అసలు బేసిన్ లో లేని రాయలసీమకు కనుక పోతిరెడ్డిపాటు విస్తరించి నీటిని ఎత్తిపోస్తే.. శ్రీశైలం ముందున్న పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ఆలంపూర్’ వద్దనే బ్యారేజీని కట్టి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకుంటానంటూ కేసీఆర్ హెచ్చరించారు. ఏపీ కనుక మొండిగా వెళితే అసలు శ్రీశైలానికి నీళ్లు రాకుండా చేస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కుదరదు అని కేసీఆర్ ఇన్ డైరెక్టుగా జగన్ కు హెచ్చరికలు పంపారు.

    ఇలా నీటివాటాలో ఏపీ మునుపటి తీరులోనే వ్యవహరిస్తే గట్టి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. తొడగొడితే పడగొట్టేలా కేసీఆర్ తీరు ఉందంటున్నారు. మరి కేసీఆర్ పంతానికి జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

    -నరేశ్