డా.పార్థసారథికి బీజేపీలో కీలకపదవి

  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా కీలక కమిటీలను నియమించింది. ఈరోజు ఢిల్లీలో కేంద్ర బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ నేతలను నియామకం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీకి చెందిన ప్రముఖ నేత డా.పార్థసారథికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. గత 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థిగా […]

Written By: NARESH, Updated On : April 23, 2021 8:30 pm
Follow us on

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా కీలక కమిటీలను నియమించింది. ఈరోజు ఢిల్లీలో కేంద్ర బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ నేతలను నియామకం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీకి చెందిన ప్రముఖ నేత డా.పార్థసారథికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. గత 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఈ నియామకాల్లో పెద్దపీట వేసింది. అంతేకాకుండా మొన్న జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జిగా కూడా పార్థసారథి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏపి- బీజేపీ మీడియా ప్యానెల్ లిస్ట్ గా కూడా కొనసాగుతున్నారు.

వృత్తిపరంగా దంతవైద్యుడు అయిన పార్థసారథి ‘పార్థ డెంటల్ ’ పేరుతో దేశ వ్యాప్తంగా డెంటల్ క్లినిక్ లు నడుపుతూ సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా డా.పార్థసారథిని భారతీయ జనతా పార్టీ ఏకంగా జాతీయస్థాయి పదవి అయిన ‘ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి’గా నియమించింది.

ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి’గా నియామకమైన తర్వాత డా.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తిస్తుందనడానికి ఈ పదవే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి , రాష్ట్ర ఇన్చార్జిలు మురళీధరన్ , సునీల్ దేవధర్ లకు ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి నన్ను ఎంచుకున్నందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.