మే 31 వరకు దేవాలయాలకు రావద్దు..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనములను దేవాదాయ శాఖ నిలుపుదల చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు విడుదల చేశారు. మే 31 వరకూ అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయని ఉత్తర్వులలో పేర్కొంది. అదే విధంగా ఆర్జిత సేవలు కోసం ఆన్ లైన్ […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 4:52 pm
Follow us on


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనములను దేవాదాయ శాఖ నిలుపుదల చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు విడుదల చేశారు. మే 31 వరకూ అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయని ఉత్తర్వులలో పేర్కొంది.

అదే విధంగా ఆర్జిత సేవలు కోసం ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. టిటిడి, దుర్గగుడి అన్నవరం, శ్రీశైలం తదితర దేవాలయాల్లో లాక్ డౌన్ ముగిసిన అనంతరం భక్తులను తక్కువ సంఖ్యలో దర్శనానికి అనుమతించడానికి సామాజిక దూరం పాటిస్తూ మార్కింగ్ చేశారు. మే 28వ తేదీన టిటిడి పాలకవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడంపై నిర్ణయం తీసుకొనున్నారు.