బస్సులు నడపాలని సీఎం ఆదేశం..!

రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని, దశలవారీగా ఈ సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బస్సులు నడపడిపే విషయం చర్చించారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ బస్సులు ఉండాలని, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఉండకూడదన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 4:45 pm
Follow us on


రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని, దశలవారీగా ఈ సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బస్సులు నడపడిపే విషయం చర్చించారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ బస్సులు ఉండాలని, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఉండకూడదన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులు ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

దీని వల్ల వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సులలో సగం సీట్లు మాత్రమే నింపాలని సూచించారు. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రానికి రావాలనుకుంటున్న వారి కోసం బస్సులు నడపాలని సూచించారు. రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించడానికి ముందు వలస కార్మికుల తరలింపు పూర్తి చేయాలన్నారు. బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించాలని నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమని చెప్పారు. కారులో ముగ్గురు మాత్రమే, బస్సులో 20 మందికే ప్రతి దుకాణంలో 5గురు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉంటుందన్నారు.

వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని అభినందించారు. రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారన్నారు. యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నట్లు చెప్పారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయమని తెలిపారు.

రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే కు అనుమతి ఇవ్వాలన్నారు. టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని,నైట్‌ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగించాలన్నారు. అన్ని దుకాణాలూ ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వమని అధికారులకు సూచించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియజేయడంపై దృష్టిపెట్టాలన్న ఆదేశించారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

వార్డు క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తికావాలని చెప్పారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.