కరోనాపై పోరుకు క్రీడాకారుల విరాళాలు

దేశంలో కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. క్రికెటర్లు, బ్మాడ్మింటన్, ఫుల్ బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్ తదితర క్రీడాకారులు కరోనా పోరుకు సిద్ధమవుతున్నారు. తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు. సినీ స్టార్లకు తోడుగా క్రీడాకారులు విరాళాలు ప్రకటిస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా(కోవిడ్-19)వైరస్ కట్టడికి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సాయమందించేందుకు ముందుకొచ్చింది. దేశంలో లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి లేకుండా రోడ్డునపడ్డ వారి […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 7:50 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. క్రికెటర్లు, బ్మాడ్మింటన్, ఫుల్ బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్ తదితర క్రీడాకారులు కరోనా పోరుకు సిద్ధమవుతున్నారు. తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు. సినీ స్టార్లకు తోడుగా క్రీడాకారులు విరాళాలు ప్రకటిస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా(కోవిడ్-19)వైరస్ కట్టడికి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సాయమందించేందుకు ముందుకొచ్చింది. దేశంలో లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి లేకుండా రోడ్డునపడ్డ వారి కోసం ఏమన్న చేయాలన్న తపనతో కొందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి రూ.1.25కోట్లను విరాళంలో సేకరించినట్లు తెలిపారు. యూత్ఫీడ్ ఇండియా సఫా ఇండియా ఇందులో భాగస్వామ్యమయ్యాయని పేర్కొన్నారు. రూ.1.25కోట్ల విరాళాలతో అన్నార్థులకు సాయం చేయనున్నట్లు సానియా సోమవారం తన ట్విటర్లో పేర్కొన్నారు.

ఇండియన్ క్రికెట్ రోహిత్ శర్మ 80లక్షల విరాళాలను ప్రకటించారు. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. అలాగే మహిళా క్రీడాకారులు మిథాలీ రాజ్ రూ. 10లక్షలు, స్పిన్నర్ పూనం యాదవ్ రూ. 2లక్షలు, ఎంపీ మేరీకోమ్ తన నెల జీతం, దీప్తి శర్మ రూ. 1.5లక్షలు, షూటర్ మనుబాకర్ లక్ష రూపాయలు, స్ప్రింటర్ హిమదాస్ తన నెల జీతం విరాళాలను తాజాగా ప్రకటించారు. గతంలోనూ కొందరు క్రీడాకారులను విరాళాలను ప్రకటించారు. కరోనాపై పోరాటానికి క్రీడాకారులు ముందుకొస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.