సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన సంస్థ

ప్రముఖ మందుల తయారీ సంస్థ దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఎన్ సి సి లిమిటెడ్ లు కొవిడ్ 19 విపత్తు సందర్భంగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ఇవ్వడం జరిగింది. విజయవాడలోని ప్రధాన కార్యదర్శి విడిది కార్యాలయంలో మంగళవారం సాయంత్రం దివిస్ లేబోరేటరీస్ లిమిటెడ్ రూ. 5 కోట్లు ను , ఎన్ సి సి లిమిటెడ్ రూ.1 కోటి రూపాయల చెక్కులను కంపెనీ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి ముఖ్యమంత్రి […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 7:36 pm
Follow us on

ప్రముఖ మందుల తయారీ సంస్థ దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఎన్ సి సి లిమిటెడ్ లు కొవిడ్ 19 విపత్తు సందర్భంగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ఇవ్వడం జరిగింది. విజయవాడలోని ప్రధాన కార్యదర్శి విడిది కార్యాలయంలో మంగళవారం సాయంత్రం దివిస్ లేబోరేటరీస్ లిమిటెడ్ రూ. 5 కోట్లు ను , ఎన్ సి సి లిమిటెడ్ రూ.1 కోటి రూపాయల చెక్కులను కంపెనీ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులను అందచేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.44.52 లక్షల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సంఘం నాయకులు అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌కు చెక్కు అందించిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ కన్వీనర్‌ యార్లగడ్డ రాజాచౌదరి, కో కన్వీనర్‌ మాధవ్‌లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అందజేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు చెక్కును అందించారు.