ట్రంప్ స్వదేశీ.. బిడెన్ విదేశీ.. అమెరికన్స్ ఎటువైపు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అని స్వదేశీ నినాదాన్ని మొన్నీమధ్యే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రత్యర్థి.. డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ సంచలన ప్రకటన చేశాడు. విదేశీ విధానాన్ని ఎంచుకున్నాడు. తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ ప్రచారంలో భాగంగా ఇమిగ్రేషన్, వలసవాదులపై సంచలన ప్రకటనలు చేశారు. తాను […]

Written By: NARESH, Updated On : July 2, 2020 5:06 pm
Follow us on


అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అని స్వదేశీ నినాదాన్ని మొన్నీమధ్యే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రత్యర్థి.. డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ సంచలన ప్రకటన చేశాడు. విదేశీ విధానాన్ని ఎంచుకున్నాడు.

తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ ప్రచారంలో భాగంగా ఇమిగ్రేషన్, వలసవాదులపై సంచలన ప్రకటనలు చేశారు. తాను గెలిస్తే హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తానని ప్రకటించారు. అమెరికా దేశాన్ని నిర్మించారంటూ హెచ్1బీ వీసాదారుల సేవలను కొనియాడారు. ఈ దేశానికి ఎంతో సహకారం అందించిన 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసి కాంగ్రెస్ కు పంపిస్తానని కీలక ప్రకటన చేశారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవని.. క్రూరమైనవనీ ఆరోపించారు.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

ఇక భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పారు జోబిడెన్.మెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తానని భారతీయుల ఓట్లను గెలిచేందుకు హామీల వర్షం కురిపించారు. భారత్ అమెరికాకు మిత్రదేశం అని.. తమ ప్రభుత్వం ఏర్పడితే అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. కాగా అమెరికా-భారత్ మధ్య తానే అణుఒప్పందం కుదిర్చినట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ స్వదేశీ నినాదం ఎంచుకొని అమెరికన్స్ కే ఉద్యోగాలని విదేశీయులను తరిమేలా ఇమిగ్రేషన్ ను డిసెంబర్ వరకు రద్దు చేశారు. ట్రంప్ ఖాతాలో కరోనా విపత్తు, నల్లజాతీయులపై దాడులు పెద్ద మచ్చగా మారాయి. కరోనాను కంట్రోల్ చేయలేని ట్రంప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే హెచ్1బీ సహా వలస వాదుల వీసాలు రద్దు చేసి అమెరికన్ల దృష్టిలో ట్రంప్ హీరో అవ్వగా.. కార్పొరేట్ కంపెనీలు.. దేశాన్ని ఆర్థిక శక్తిగా మలిచిన హెచ్1బీ సహా వలసవాదులకు ట్రంప్ విలన్ అయ్యారు.
హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఇప్పుడు జోబిడెన్ వలసవాదులకు బార్లా తెరుస్తానంటున్నాడు. వారినే నెత్తిన పెట్టుకుంటానని తెలిపాడు. హెచ్1బీపై నిషేధం ఎత్తివేసి నిపుణులను దేశంలోకి ఆహ్వానిస్తానంటున్నాడు.

మరి ఈ ఇద్దరిలో ట్రంప్ స్వదేశీ నినాదం పనిచేస్తుందా? విదేశీయులకు బార్లా తెరుస్తున్న జోబిడెన్ కు మద్దతు లభిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పోయిన సారి ఎన్నికల్లోనూ ట్రంప్ ఇలా అమెరికన్స్ ఫస్ట్ అని గెలిచాడు. ఇప్పుడు అది పునరావృతం అవుతుందా లేదా అన్నది వేచిచూడాలి..

– నరేశ్ ఎన్నం