రెండో విడతలో మొదటి టీకా మోడీకే..

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు అనుమతి రావడంతో దేశంలో జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు 8 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు. తొలివిడతలో ఆరోగ్యసిబ్బందికి, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. మొత్తం మూడు కోట్ల మందికి తొలివిడతలో వ్యాక్సిన్ అందించనున్నారు. మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందించిన తరువాత రెండో దశలో 50 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది. […]

Written By: Srinivas, Updated On : January 21, 2021 1:59 pm
Follow us on


కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు అనుమతి రావడంతో దేశంలో జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు 8 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు. తొలివిడతలో ఆరోగ్యసిబ్బందికి, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. మొత్తం మూడు కోట్ల మందికి తొలివిడతలో వ్యాక్సిన్ అందించనున్నారు. మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందించిన తరువాత రెండో దశలో 50 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది.

Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

అయితే.. రెండోదశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకోబోతున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రులకు కూడా ఈ టీకా అందించబోతున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. మూడు కోట్ల మందికి ముగిసిన వెంటనే రెండో దశ ప్రారంభం కానుంది. ఈ రెండో విడతలో ఫస్ట్‌ టీకా ప్రధాని మోడీ, అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకా ఇవ్వనున్నారు.

Also Read: ట్రంప్‌ కొత్త పార్టీ..! : అనౌన్స్‌ మాత్రం ఇప్పుడు కాదట

బుధవారం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 1,12,007 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే.. ఐదో రోజున వ్యాక్సినేషన్‌లో 82 కేసుల్లో ప్రతికూల ప్రభావాలు కనిపించినట్లు పేర్కొంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాలు అందించిన వ్యాక్సినేషన్‌ కంటే మన సంఖ్య ఎక్కువ అని తెలిపింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్