అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నవంబర్లో ఎన్నికల ఫలితాలు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ట్రంప్ 232 ఎలక్ట్రోరల్ ఓట్లు రాగా డెమెక్రాటిక్ అభ్యర్థి బిడైన్ కు 306 ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు.
Also Read: భారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా?
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓటమితో అధికార బదిలీ జరుగాల్సి ఉండగా ట్రంప్ పంతం కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్వేత సౌధం అధికారులు మాత్రం అధికార బదిలీ కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. తాజాగా శ్వేత సౌదం ప్రెస్ సెక్రటరీ క్యాలీ మెక్ మీడియాతో మాట్లాుడతూ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వాదనను సమర్థించారు.
చట్టబద్ధమైన ప్రతీ ఓటును లెక్కించాలని ట్రంప్ కోరడం కరెక్టేనని చెప్పారు. అయితే ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తాననేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే అధ్యక్ష మార్పిడి చట్టం ప్రకారం పాటించాల్సిన అన్ని పనులను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అధికార మార్పిడి చేయాల్సిన జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బైడెన్ విజయం సాధించినట్లు పత్రాలు అందకపోవడంతో అధికారులు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.
Also Read: ఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?
మరోవైపు బైడెన్ మాత్రం మంత్రి వర్గ కూర్పుపై ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే 15మందితో నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతున్నాడు. అయితే ట్రంప్ మాత్రం తనను ఔషధ కంపెనీలు తనపై దుష్ప్రచారం చేసి ఓడిచేందుకు కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను మాత్రం ఔషధ కంపెనీలు ఖండిస్తున్నాయి. ఈ తరుణం అధ్యక్ష మార్పిడికి ఇంకా కొంత సమయం పట్టేలా కన్పిస్తోంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు