ఏపీలో ఈ లొల్లి వద్దు.. ఢిల్లీకి పోతాం…

ఏపీ లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఢిల్లీ బాట పడుతున్నారట. కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. వారికి ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. ఐపీఎస్‌లు వరుసగా కేంద్ర సర్వీస్‌లకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కాస్త విచిత్రంగా ఉందనే వాదనలు ఉన్నాయి. పోలీస్ బాస్‌కు తెలియకుండా.. పోలీసు వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: తొలి ఆంధ్రా న్యూస్ ఛానల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందంటే?  అధికారులు కేవలం పదవిలో ఉండటానికేన్నట్లుగా […]

Written By: NARESH, Updated On : November 22, 2020 7:11 pm
Follow us on

ఏపీ లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఢిల్లీ బాట పడుతున్నారట. కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. వారికి ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారట. ఐపీఎస్‌లు వరుసగా కేంద్ర సర్వీస్‌లకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కాస్త విచిత్రంగా ఉందనే వాదనలు ఉన్నాయి. పోలీస్ బాస్‌కు తెలియకుండా.. పోలీసు వ్యవహారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: తొలి ఆంధ్రా న్యూస్ ఛానల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందంటే?

 అధికారులు కేవలం పదవిలో ఉండటానికేన్నట్లుగా పరిస్థితి మారిపోయింది కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది మంది గుప్పిట్లోనే అన్ని శాఖలు ఉన్నయట.  పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం.. పార్టీలో ఉన్న పొజిషన్‌ను ఆసరాగా చేసుకుని.. పనులు నడిపిస్తన్నట్లు తెలుస్తోంది.

తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కోర్టుల్లో నిలబడటం లేదు. చాలా వరకు.. తప్పుడు నిర్ణయాలు. రేపు ఏదైనా తేడా వస్తే.. కేసులు పాలవడం కూడా ఖాయమన్న చర్చ జరుగుతోంది.

 వైసీపీ నేతలకు లబ్ది కలిగించే నిర్ణయాలు తీసుకుంటే.. వారు లబ్దిపొందుతారు.. కానీ తర్వాత అవకతవకల కేసులు పడితే వారికేమీ నష్టం ఉండదు. ఎందుకంటే.. ఆ నిర్ణయాలు తీసుకున్న అధికారులకు మాత్రమే.. నష్టం. అని అధికారులు అనుకుంటున్నారట.

Also Read: స్వరూపానందకు ఆ ‘మర్యాద’

 గతంలో జరిగిన పరిణామాలు. ఈ ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్యల కారణంగా.. అనేక మంది అధికారులు ఇప్పటికే. ఇబ్బంది పడుతున్నరని తెలుస్తోంది. రేపు ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితేమిటన్న చర్చ. అధికారుల్లో నడుస్తోంది. అందుకే నాలుగేళ్ల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్నవారు. కేంద్ర సర్వీసుల ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

ముందు ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత ఏపీ సర్కార్ కు దరఖాస్తు చేసుకుటే.. తిరస్కరించే అవకాశం ఉండదని అంచనా కొచ్చి ఆ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ సర్వీసులో ఏర్పడిన పరిచయాలతో లాబీయింగ్ చేసుకుని అయినా సరే… ఏపీ నుంచి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్