https://oktelugu.com/

కమెడియన్ దంపతులకు 4 వరకు రిమాండ్

  డ్రగ్స్ కేసులో అరెస్టయిన కమెడియన్ భారతీసింగ్, అమె భర్త హర్ష్ లింబాచియాలకు ముంబై కోర్టు 14 రోజలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ ఇద్దరికి ఎన్సీబీ నిన్న అరెస్టు చేసి 12 గంటల పాటు విచారించింది. అంధేరీలోని ఆమె ఇంట్లో గంజాయి దొరికినట్లు ఎన్సీబీ తెలిపింది. దీంతో నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కింద వీరిని ఆదివారం అరెస్టు చేశారు. అయితే వారిని విచారించిన అనంతరం 14 రోజు రిమాండ్ అవసరమని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 22, 2020 / 04:41 PM IST
    Follow us on

     

    డ్రగ్స్ కేసులో అరెస్టయిన కమెడియన్ భారతీసింగ్, అమె భర్త హర్ష్ లింబాచియాలకు ముంబై కోర్టు 14 రోజలు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ ఇద్దరికి ఎన్సీబీ నిన్న అరెస్టు చేసి 12 గంటల పాటు విచారించింది. అంధేరీలోని ఆమె ఇంట్లో గంజాయి దొరికినట్లు ఎన్సీబీ తెలిపింది. దీంతో నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కింద వీరిని ఆదివారం అరెస్టు చేశారు. అయితే వారిని విచారించిన అనంతరం 14 రోజు రిమాండ్ అవసరమని ముంబై కోర్టు తెలిపింది. యాంటీ డ్రగ్స్ బ్యూరో అధికారులు శనివారం ముంబైలోని భారతిసింగ్, హర్ష్ లింబాచియా ఇంటిని తనిఖీ చేయగా 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత వారిని ముంబైకి తరలించి విచారించగా తాము డ్రగ్స్ వినియోగిస్తున్నామని ఒప్పుకున్నారు. ఒకవేళ ఈ కేసు రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.