Homeజాతీయ వార్తలుDonald Trump : ట్రంప్‌కు కోర్టు షాక్‌: భారతీయ రీసెర్చర్‌ బహిష్కరణపై కీలక ఆదేశాలు!

Donald Trump : ట్రంప్‌కు కోర్టు షాక్‌: భారతీయ రీసెర్చర్‌ బహిష్కరణపై కీలక ఆదేశాలు!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పాలనలో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్‌ బాదర్‌ ఖాన్‌ సూరి(Badar Khan Soori)ని అమెరికా నుంచి బహిష్కరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వర్జీనియా కోర్టు(Varjeenia Court) బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు సూరిని బహిష్కరించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. హమాస్‌ సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సూరిని అరెస్ట్‌ చేసి, దేశం నుంచి తరలించేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధమైంది. అయితే, ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తిగత హక్కులను కాలరాస్తున్నాయని కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.

ట్రంప్‌ పాలనలో కోర్టు జోక్యం
డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, వాటిని రాజ్యాంగబద్ధంగా చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాలకు అమెరికా కోర్టులు అడ్డుకట్ట వేస్తున్నాయి. హమాస్‌(Hamas)తో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో భారతీయ రీసెర్చర్‌ బాదర్‌ ఖాన్‌ సూరిని అమెరికా భద్రతా అధికారులు అరెస్ట్‌ చేశారు. త్వరలోనే ఆయనను భారత్‌కు తిరిగి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సూరి కోర్టును ఆశ్రయించారు. తన భార్య పాలస్తీనా సంతతికి చెందిన అమెరికన్‌ పౌరురాలు కావడమే ఈ చర్యలకు కారణమని, తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read : ఆ 41 దేశాలపై అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌.. ట్రంప్ మరో సంచలనం

వర్జీనియా కోర్టు కీలక తీర్పు..
వర్జీనియా కోర్టు ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సూరిని బహిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ దృక్పథం ఆధారంగా వ్యక్తులను నిర్బంధించడం, వారి ఇమ్మిగ్రేషన్‌ హోదాను తొలగించడం సరైనది కాదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బహిష్కరణకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేసింది.

బాదర్‌ ఖాన్‌ సూరి నేపథ్యం
బాదర్‌ ఖాన్‌ సూరి భారతదేశానికి చెందిన పరిశోధకుడు. ఆయన స్వస్థలం గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ, ఆయన విద్యాభ్యాసం భారత్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ(New Delhi)లోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీస్‌ అండ్‌ కాన్ఫ్లిక్ట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ(PhD) పూర్తి చేసిన సూరి, ఇరాక్‌ మరియు అఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేశారు. అమెరికాకు వలస వెళ్లిన ఆయన, పాలస్తీనా మూలాలు ఉన్న అమెరికన్‌ పౌరురాలు మఫెజ్‌ అహ్మద్‌ యూసఫ్‌ సలేహ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి అహ్మద్‌ యూసఫ్‌ హమాస్‌లో కీలక నేతగా ఉన్నట్లు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) పేర్కొంది.

చర్చనీయాంశంగా అరెస్ట్‌..
బాదర్‌ ఖాన్‌ సూరి అరెస్ట్‌తో జాతీయ భద్రత, వ్యక్తిగత హక్కులు, విద్యా సంస్థలపై రాజకీయ ప్రభావం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా విదేశాంగ విధానం ప్రకారం, ఆ దేశానికి ముప్పుగా భావించే విదేశీయులను బహిష్కరించే ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని సూరిపై అమలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే చట్టం ద్వారా కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ అయిన మహ్మూద్‌ ఖలీల్‌ను కూడా బహిష్కరించారు.

ఈ తీర్పు ద్వారా ట్రంప్‌ ప్రభుత్వం రాజకీయ దృక్పథాల ఆధారంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అమెరికా రాజ్యాంగంలోని మౌలిక హక్కులకు విరుద్ధమని స్పష్టం చేసింది.

Also Read : కోడిగుడ్లు కావాలి.. సాయం చేయండి ప్లీజ్‌.. యాచిస్తున్న అగ్రరాజ్యం!

RELATED ARTICLES

Most Popular