Donald Trump: అగ్రరాజ్యం అమెరికా 47 అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తోంది. ట్రంప్ 2.0 పాలనలో ఆ దేశ ప్రజలతోపాటు ఆ దేశంలోని అక్రమ వలసదారులు, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అమెరికాను గ్రేట్ చేస్తామంటున్న ట్రంప్.. నిర్ణయాలతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆదేశంలో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయే తప్ప, తగ్గే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి, దీంతో గుడ్ల కొరత ఏర్పడింది. ఫలితంగా, అమెరికా మార్కెట్లో గుడ్ల ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గుడ్ల ధరలను అదుపులోకి తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
Also Read: దొరకని అమెరికా వీసా ..తెచ్చిన లోన్లకు పెరుగుతున్న వడ్డీలు.. తీవ్ర ఇబ్బందుల్లో స్టూడెంట్స్
దిగుమతులపై దృష్టి..
పలు రకాల దిగుమతులపై సుంకాలు విధిస్తున్న ట్రంప్ కోడిగుడ్ల దిగుమతులపై దృష్టి పెట్టారు. డెన్మార్క్‌తోపాటు ఇతర యూరప్ దేశాల నుంచి తమకు తగినంత గుడ్లు కావాలని వేడుకుంటున్నాడు. ఈమేరకు అమెరికా వ్యవసాయ విభాగం ఆయా దేశాలకు లేఖలు రాసింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు యూరప్ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూనే, మరోవైపు గుడ్ల సరఫరా కోసం విజ్ఞప్తి చేయడం గమనార్హం.
యూరప్ దేశాల్లోనూ అంతంతే..
అయితే, యూరప్ దేశాల్లోనూ గుడ్ల ఉత్పత్తి సరిపడా లేదని, అమెరికాకు పెద్ద మొత్తంలో గుడ్లను ఎగుమతి చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదని డెన్మార్క్ ఎగ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ డెన్‌మార్క్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రీన్లాండ్‌ను తమకు అప్పగించకపోతే డెన్మారŠైక్ప ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. అమెరికాలో గత ఏడాది డిసెంబర్ నుంచి గుడ్ల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 5వ తేదీ నాటికి డజన్ గుడ్ల ధర 8.64 డాలర్లు (సుమారు రూ.751)కి చేరుకుంది, అంటే ఒక్కో గుడ్డు ధర 62 రూపాయలు. అయితే, ఈ నెల 5 తర్వాత గుడ్ల ధరలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అమెరికా వ్యవసాయ విభాగం తెలిపింది. ప్రస్తుతం డజన్ గుడ్ల ధర 4.90 డాలర్లు (సుమారు రూ.425)గా ఉన్నట్లు వెల్లడించింది.
Also Read: ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు పెట్టలేరు