Heart Surgery: మన వైద్యరంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి అవయవాలను కూడా మార్చేస్థాయికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిచెందింది. దీంతో అవయవ మార్పిడిని సులభంగా చేస్తున్నారు. ఇటీవలే మనిషికి పంది గుండె అమర్చారు అమెరికా వైద్యులు, తాజాగా తలను కూడా మార్చే ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. ఇది విజయవంతమైతే వైద్య రంగంలో మరో సంచలనమే. ఇక జంతువులకు సంబంధించిన వైద్యంలో కుటుంబ నియంత్రణ, ఇతర వైద్యం మాత్రమే చేస్తున్నారు. కానీ ఢిల్లీ వైద్యులు అరుదైన గుండె ఆపరేషన్ చేశారు. భారతదేశంలో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి.
ఏమిటి సమస్య..
ఏడేళ్ల వయసున్న జాలియన్ అనే శునకం రెండేళ్లుగా మైట్రాల్ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కుక్కల్లో వచ్చే గుండె సమస్యల్లో ఇది ప్రధానమైంది. దీని వలన గుండె ఎడమ ఎగువ గదిలో రక్త ప్రవాహం వెనక్కి వెళ్తుంది. ఈ వ్యాధి ముదిరేకొద్ది ఊపిరి తిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పరుగుతుంది. క్రమంగా గుండె ఫైయిల్ అవుతుంది.
వ్యాధి నిర్ధారించి చికిత్స..
జాలియన్ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు ఢిల్లీలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్ భానుదేవ్‌శర్మ నేతృత్వంలో వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. ఆపరేషన్‌కు ముందుకు వచ్చింది. ట్రాన్స్ కేథతర్ ఎడ్జ్–టు–ఎడ్జ్ రిపెయిర్ )టీఈఈఆర్) అనే ప్రక్రియద్వారా శస్త్ర చికిత్స చేశారు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం ద్వారా గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. మే 30న ఈ ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత శునకాన్ని డిశ్యార్జి చేశారు. ప్రస్తుతం జాలియన్ ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
మనుషుల తరహాలోనే..
మనుషుల్లో గుండె సమస్య వస్తే.. గతంలో ఓపెహార్ట్ సర్జరీ చేసేవారు. కానీ వైద్యరంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు ఇప్పుడు గుండె ఆపరేషన్‌ను సులభతరం చేశాయి. ఎలాంటి కోత లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విధానాన్నే ఢిల్లీ వైద్యులు కుక్క గుండె ఆపరేషన్ విషయంలో వినియోగించారు.
Also Read: Lok Sabha Election 2024: దేశంలో హ్యాట్రిక్ సీఎంలు.. పీఎంలు వీరే..
అమెరికాలో ఈ కొత్త విధానం..
జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంతో శర్మ నిష్ణాతులు. అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమలులోకి వచ్చింది. ట్రాన్స్ క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ విధానంలో ఆపరేషన్ నిర్వహించారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహాలోనే 80 శాతం ఉడడం గమనార్హం. శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన రెండో ప్రైవేటు వైద్య బృందం వీల్లే అని పేర్కొంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Dog undergoes non invasive heart surgery in delhi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com