TDP: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీడీపీపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. వైసీపీకి రాష్ర్టంలో ఎదురులేకుండా పోతోంది. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీకి అపజయమే కలగడం వైచిత్రమే. కానీ ఏపీలో చంద్రబాబు పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీకి సరైన సమాధానం చెప్పలేకపోతోంది. 2024లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మాత్రం సరైన పోటీ ఇవ్వకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.

మరోవైపు జనసేన కూడా తన ప్రభావం చూపలేకపోయింది. ఒక కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ స్థానాల్లో అధికార పార్టీ విజయదుందుభి మోగించింది. వైసీపీ అన్ని వైపులా దాడి చేసి ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేయడం గమనార్హం. ఈ క్రమంలో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ హవాకు టీడీపీ తట్టుకోలేకపోయింది. కుప్పం లాంటి చోట దొంగ ఓట్లు పడ్డాయని టీడీపీ మొదటి నుంచి చెప్పుకున్నా మెజార్టీ ప్రజలు మాత్రం వైసీపీనే నమ్ముతున్నట్లు సమాచారం.
ప్రజల నాడి గుర్తించడంలో టీడీపీ విఫలమైంది. రోజురోజుకు తన ప్రతిష్టను కోల్పోతోంది. ఇందులో భాగంగానే ఒక్క దర్శి మున్సిపాలిటీలో గెలిచింది తప్ప మెజార్టీ స్థానాల్లో ఏకపక్షంగా ఓట్లు పోలవడం తెలిసిందే. టీడీపీకి ఇంత దారుణమైన ఓటమి ఎప్పుడు కలగలేదు. దీంతో పార్టీ నేతల్లో కూడా నైరాశ్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే టీడీపీ రాబోయే ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపించలేకపోతుందనే సమాధానం అందరిలో వస్తోంది.
ఇప్పటికైనా టీడీపీ తన వైఖరి మార్చుకోవాలి. ప్రజల్లో నిలిచి పోరాడేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. కానీ టీడీపీలో ప్రక్షాళన మాత్రం జరగడం లేదు. అందుకే గుణపాఠం నేర్వడం లేదు. దీంతోనే అపజయం పాలవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ తన మనుగడ కోసం పాకులాడాల్సిన సమయం ఆసన్నమైందని సమాచారం. పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పోరు చేయాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు.
Also Read: KCR Dharna Chouwk: ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు ఇప్పుడు అదే దిక్కైంది?
మరోవైపు పవన్ కల్యాణ్ సైతం తన పార్టీని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం చేయాలి. అందు కోసమే పవన్ ప్రజల్లో నిలబడి ప్రజాసమస్యలపై పోరాడాల్సిన సమయం వచ్చింది. దీనికి అందరిని కలుపుకుని పోరాటం చేసి జనసేనను పునర్నిర్మించాలని అందరిలో వస్తున్న అభిప్రాయం.
Also Read: BC calculation: బీసీ గణనకు కేంద్రం అంగీకరిస్తుందా?