AP Fisheries: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. చేపల చెరువులను బహిరంగ వేలం వేయాలని చూస్తోంది. దీంతో వారి ఉపాధి పోతోంది. దీనిపై ఉద్యమించేందుకు జనసేన సిద్ధమైంది. మత్స్యకారుల పక్షాన పోరాడేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20న సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ తీరును దుయ్యబట్టేందుకు సమాయత్తం అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో కులాల ఉపాధిని దెబ్బ తీసే క్రమంలో ప్రభుత్వం కొత్త జీవోలకు తెర తీస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా 217 జీవో తీసుకొచ్చి వారి జీవనోపాధిని లాక్కోవాలని చూస్తోంది.

దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలదీసి మత్స్యకారుల ఉపాధికి భంగం కలగకుండా చూడాలని భావిస్తున్నారు.వారి ఓట్లను కూడా తమ పార్టీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. దీని కోసమే వారితో కలిసి ఉద్యమించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నిర్ణయాలు ఎండగట్టేందుకు ముందకు వస్తున్నారు.
గత నవంబర్ లోనే ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు సభ నిర్వహించాల్సి ఉన్నా వర్షాల కారణంగా సభ రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం నిర్వహించే పనిలో పడ్డారు. ఈనెల 13 నుంచి మత్స్యకార గ్రామాల్లో అభ్యున్నతి యాత్ర పేరుతో అన్ని గ్రామాలు తిరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మత్స్యకారుల్లో అవగాహన పెరిగేందుకు దోహదం చేసేందుకు ఈ యాత్రలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న జగన్ టీం
మత్స్యకారుల భుక్తి లాగేసుకునే పనిలో భాగంగానే వైసీపీ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారి నోటికాడి బుక్క లాక్కునేందుకు జీవో నెం.217 తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ నిర్వాకాన్ని నిరసిస్తూ జనసేన వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో పడిపోతోంది. దీనికి గాను వారిలో భరోసా నింపేందుకు పవన్ కల్యాణ్ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో వైసీపీ ఆగడాలను ఎండగట్టే క్రమంలో ఎంతకైనా పోరాడాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపే పనిలో భాగంగానే పవన్ కల్యాణ్ ముందుకు అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మత్స్యకారులు నివసించే గ్రామాల్లో పర్యటించి వారి జీవనోపాధికి ఢోకాల లేదని చెప్పేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్ని నిర్ణయంతో మత్స్యకారుల జీవితాలకు న్యాయం జరుగుతుందా? లేదా? అనేదే ప్రశ్న.
Also Read: ఉద్యోగులకు బాసటగా బాబుః జగన్ కు తలనొప్పేనా?