https://oktelugu.com/

Sunitha: ‘నీ భర్త ముసలోడు’ అంటూ సునీత పై ట్రోలింగ్

Sunitha: తన గాత్రం, అందంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె తన భర్త రామ్‌ తో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సరదాగా ఫోటోలు దిగింది. ఇక, ఆ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఆమె ఫోటోను పోస్ట్ చేయగానే.. దాని పై […]

Written By:
  • Shiva
  • , Updated On : February 5, 2022 / 03:55 PM IST
    Follow us on

    Sunitha: తన గాత్రం, అందంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె తన భర్త రామ్‌ తో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సరదాగా ఫోటోలు దిగింది.

    Sunitha

    ఇక, ఆ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఆమె ఫోటోను పోస్ట్ చేయగానే.. దాని పై ఓ నెటిజన్ ‘కాకి ముక్కుకు దొండ పండు.. సునీతకు ముసలి రామ్ మొగుడు’ అంటూ చాలా నీచమైన కామెంట్ పెట్టాడు. సహజంగా ఇలాంటి కామెంట్లను ప్రముఖులు పట్టించుకోరు. అయితే, ఈ కామెంట్ ను చూసిన సునీత చాలా సీరియస్ అయింది.

    Also Read: సలసల కాగే నూనె పోసి.. భార్య, కూతురిపై భర్త అమానుషం..

    అంతే, సీరియస్ నెస్ తో ఆ నెటిజన్ కి రిప్లై ఇస్తూ ‘నీది నోటి దూల.. నీ భారం భూమిది’ అంటూ మెసేజ్ చేసింది. మరోపక్క మరికొంతమంది తుంటరి నెటిజన్లు కూడా ‘నీ భర్త ముసలోడు’ అంటూ సునీత పై ట్రోలింగ్ కి దిగారు. సోషల్ మీడియా వచ్చాక, అసలు విలువులు కూడా లేకుండా పోతున్నాయి.

    పబ్లిక్ గా బూతులు తిట్టుకునేంతగా కొందరు దిగజారిపోతున్నారు. ఏది ఏమైనా సునీత మాత్రం రెండో పెళ్లి తర్వాత.. ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ట్రెండ్ కి తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేస్తోంది. సరదాగా పార్టీలలో కూడా పాల్గొంటుంది. అయితే, సునీత మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. సరోగసి ద్వారా సునీత జంట పిల్లలను కనాలని నిర్ణయించుకుందట.

    ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఈ వార్త పై సునీత క్లారిటీ ఇస్తే గానీ అసలు నిజం తెలియదు. అన్నట్టు డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కానుంది. సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది.

    సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    Also Read: మెటా దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోయిన జుకర్ బర్గ్.. అత‌న్ని మించిపోయిన అంబానీ, అదానీ..

    Tags