https://oktelugu.com/

షర్మిల ప్రభావం చూపుతుందా?

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్  షర్మిల సైతం నూతన పార్టీ పెడతారనే వార్త సంచలనం రేగుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఈటల వ్యవహారం ఘాటుగా మారిన పరిస్థితుల్లో షర్మిల వ్యవహారం బయటకు రావడం చర్చనీయంశంగా మారింది. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉండగా షర్మిల తెలంగాణలో ఎలా పార్టీ పెడతారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సీఎం […]

Written By: , Updated On : May 21, 2021 / 03:27 PM IST
Follow us on

Sharmilaతెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్  షర్మిల సైతం నూతన పార్టీ పెడతారనే వార్త సంచలనం రేగుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఈటల వ్యవహారం ఘాటుగా మారిన పరిస్థితుల్లో షర్మిల వ్యవహారం బయటకు రావడం చర్చనీయంశంగా మారింది. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉండగా షర్మిల తెలంగాణలో ఎలా పార్టీ పెడతారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజకీయ చతురతతో వ్యవహరిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం ఎటు వైపు వెళ్తుందోనని భావిస్తున్నారు.

షర్మిల ప్రభావం చూపనుందా?
వైఎస్ తనయురాలిగా, జగన్ సోదరిగా షర్మిల ఏ మేరకు ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో సమావేశం నిర్వహించిన షర్మిల తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా మీటింగులు పెట్టి తన ప్రభావాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఆయన అభిమానులతోనే పార్టీని నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని జిల్లాల్లో ఎంత మేరకు ప్రభంజనం సృష్టిస్తారోనని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రకటన చేయని  షర్మిల
పార్టీ పెడతారని వార్తలు వినిపిస్తున్నా కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు. దీంతో రాజకీయ పార్టీ పెట్టడంపై శ్రద్ధ కనిపించం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల ఏమేరకు విజయం సాధిస్తారు? పార్టీ పెడితే ఎవరిని తీసుకుంటారు? ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాలపై పలు ఆసక్తికరమైన అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇంతకీ పార్టీ పెడితే దాని ఆశయాలు ఏమిటి అనేక కోణాలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెడితే ఎవరెవరు చేరతారని ఆసక్తిగా చూస్తున్నారు.

నెల రోజులుగా షర్మిల పార్టీ వ్యవహరం కుదుపు కుదుపుతోంది. పార్టీ పెడితే పరిస్థితి ఏంటి అనే దానిపై పలు పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఆయా పార్టీలలో పని చేసినా తగిన గుర్తింపు దక్కకపోవడంతో కొత్త పార్టీల వైపు చూసే  నేతలు ఎక్కువగా నే ఉన్నారు. అలాంటి వారంతా షర్మిల పార్టీ పెడితే చేరతామని చూస్తున్నట్లు తెలుస్తోంది. సెకండ్ కేడర్ నేతలు తమకు సరైన విలువ ఇవ్వడం లేదని పదే పదే అధిష్టానం వద్ద వినతులు చేసుకున్నా పట్టించుకోకపోవడంతో కొత్త పార్టీల వైపు చూస్తూ పార్టీ ప్రకటిస్తే చేరిపోతామని సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.