https://oktelugu.com/

వారసత్వం అందుకోని లోకేష్‌..: చంద్రబాబుకు ఉన్న పరిణతి ఆయనకు లేదే..?

‘వడ్డించే మనోడైతే.. బంతిలో యాడ కూసున్న తిరుగు ఉండదు’ అనేది సామెత. తెలుగుదేశం పార్టీలో లోకేష్‌ పరిస్థితి కూడా అదే. ఆ పార్టీకి అధినేత ఆయన తండ్రి చంద్రబాబే. ఇంకే ఒక పార్టీకి తన తండ్రే అన్నీ అయినప్పుడు ఇక ఆ కొడుక్కి ఏం తక్కువ. అందులోనూ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవులు దక్కడం కూడా అదృష్టమే కదా..! కానీ.. ఆ అవకాశాన్ని లోకేష్‌ బాబు అంతగా సద్వినియోగం చేసుకున్నట్లుగా కనిపించడం లేదు. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2021 / 09:54 AM IST
    Follow us on


    ‘వడ్డించే మనోడైతే.. బంతిలో యాడ కూసున్న తిరుగు ఉండదు’ అనేది సామెత. తెలుగుదేశం పార్టీలో లోకేష్‌ పరిస్థితి కూడా అదే. ఆ పార్టీకి అధినేత ఆయన తండ్రి చంద్రబాబే. ఇంకే ఒక పార్టీకి తన తండ్రే అన్నీ అయినప్పుడు ఇక ఆ కొడుక్కి ఏం తక్కువ. అందులోనూ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పదవులు దక్కడం కూడా అదృష్టమే కదా..! కానీ.. ఆ అవకాశాన్ని లోకేష్‌ బాబు అంతగా సద్వినియోగం చేసుకున్నట్లుగా కనిపించడం లేదు.

    Also Read: ఫైనల్: ఏపీలో 26 కొత్త జిల్లాలు ఇవీ..

    ఎందుకంటారా..! చంద్రబాబు ఈ రోజుకు ఇంతటి నాయకుడు అయ్యాడు. కానీ ఆయన నేరుగా అందలాలు ఎక్కలేదు. బాబు ఎమ్మెల్యే, మంత్రి ముఖ్యమంత్రి దాకా చేసిన శ్రమ, పడిన కష్టం కళ్ల ముందే ఉన్నాయి. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నా లోకేష్ మరింతగా మరుగు పరచుకునే అవకాశం ఉంది. చంద్రబాబు తాను ఎన్టీయార్ అల్లుడు అయినా కూడా సాధారణ కార్యకర్తలా పార్టీలో పనిచేశారు. కాబట్టే ఎన్టీయార్ తరువాత ఆయనే ఆల్టర్నేట్‌ అని తమ్ముళ్లు అంతా నమ్మే పరిస్థితి వచ్చింది. బాబు ఓవర్ నైట్ లీడర్ కాలేదు అన్నది లోకేష్ గుర్తించాల్సి అవసరం ఉంది.

    ప్రస్తుతం ఏపీకి జగన్ సీఎంగా ఉన్నారు. ఆయనది కూడా పుష్కర కాలం కష్టం. కానీ.. తండ్రి చాటు బిడ్డగా జగన్ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. తనను తాను జనాల్లో రుజువు చేసుకున్నాడు. జగన్ ఓపిక పట్టుదల, సంకల్పం, ఆయన ఇమేజ్‌ని బిల్డప్ చేశాయి. ఇచ్చిన మాట తప్పకపోవడమే కాదు 3700 కిలోమీటర్లు దూరం నడిచి తనను తాను జగన్ తీర్చిదిద్దుకున్నాడు. జగన్ రాజకీయంగా గెలవకముందే జనాల మనసును గెలుచుకున్నాడు. అది సాధించాక రాజకీయంగా ఎంత దూరమైనా జనమే జగన్ని తీసుకెళ్తారు. అటువంటి జగన్‌ను పట్టుకొని సవాళ్లు చేస్తున్నారు లోకేష్. జగన్‌తో పోలిక పెట్టుకుని తానూ కాబోయే సీఎంగా భావిస్తే అది లోకేష్ ఫ్యూచర్‌‌కే ముప్పు అని సొంత పార్టీలోనే ఓ వైపు చర్చ సాగుతోంది.

    Also Read: వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌

    కానీ.. లోకేష్‌ తేల్చుకోవాల్సింది జగన్‌తో కాదు. ఈ సంగతి ఎంత తొందరగా లోకేష్‌కి అర్థమైతే అంత తొందరగా ఆయనకూ టీడీపీకి మేలు జరుగుతుంది. విపక్ష స్థానం నిజంగా గొప్పది. ఎన్నో నేర్పిస్తుంది. చంద్రబాబు అటు అధికారం చూశారు, ఇటు ప్రతిపక్షమూ చూశారు. ఆయన్ని పక్కన పెడితే భావి రాజకీయం అంతా టీడీపీతో ముడిపడి ఉంది లోకేష్‌కి మాత్రమే. లోకేష్ కూడా తండ్రి మాదిరిగా సవాళ్లు చేస్తాను, భారీ స్టేట్‌మెంట్స్‌ ఇస్తాను అంటే కుదిరే వ్యవహారమేనా. చంద్రబాబుని లీడర్‌‌గా జనం ఎప్పుడో గుర్తించారు. మరి అలాంటి ఛాన్స్ తానూ తీసుకోవాలంటే లోకేష్ నడవాల్సింది జనం బాటనే కదా. ఏది ఏమైనా మంత్రి అయ్యాను కదా అనుకుంటే అది జనం ఇచ్చిందేనని లోకేష్‌ తెలుసుకుంటే ఎంతో ఉన్నతి సాధించినట్లే.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్