కేసీఆర్‌‌ వల్లే బీజేపీ బలపడిందట..: వీహెచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే ఏదో నామమాత్ర పార్టీ. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఎప్పుడైతే ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగిందో ఆరోజు నుంచి బలం నిరూపించుకుంటూ వస్తోంది. దీనికితోడు బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా బండి సంజయ్‌ కుమార్‌‌ నియామకం అయినప్పటి నుంచి పార్టీలో మంచి ఊపు కనిపిస్తోంది. Also Read: వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురినే మట్టికరిపించి షాకిచ్చిన కమలనాథులు.. దుబ్బాక ఉప ఎన్నికతో ఫుల్‌ […]

Written By: Srinivas, Updated On : January 10, 2021 10:05 am
Follow us on


మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే ఏదో నామమాత్ర పార్టీ. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ.. ఎప్పుడైతే ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగిందో ఆరోజు నుంచి బలం నిరూపించుకుంటూ వస్తోంది. దీనికితోడు బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా బండి సంజయ్‌ కుమార్‌‌ నియామకం అయినప్పటి నుంచి పార్టీలో మంచి ఊపు కనిపిస్తోంది.

Also Read: వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురినే మట్టికరిపించి షాకిచ్చిన కమలనాథులు.. దుబ్బాక ఉప ఎన్నికతో ఫుల్‌ జోష్‌లోకి వచ్చారు. ఆ తరువాత వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కి భారీ ఝలక్ ఇచ్చారు. ఒకానొక దశలో జీహెచ్‌ఎంసీ మేయర్‌‌ పీఠం కూడా బీజేపీ వశం అవుతుందోనని అందరూ ఊహించుకున్నారు. పోరాడి ఓడినా అధికార పార్టీకి మాత్రం ముచ్చెమటలు పట్టించారు. అసలు బీజేపీ దూకుడుకు కారణమేంటి? ఇంత తక్కువ కాలంలో బీజేపీ అనూహ్యంగా ఎలా ఎదిగింది..? అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కారణంగానే బీజేపీ రాష్ట్రంలో బలపడిందని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకెవరూ అడ్డు ఉండకూడదన్న కేసీఆర్ ఆలోచనే కాషాయదళానికి జవసత్వాలు నింపిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని.. చివరికి అదే చేటు తెచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని తప్పు చేశారని వీహెచ్ అన్నారు.

Also Read: గుడ్ న్యూస్: దేశంలో కరోనా టీకాల పంపిణీ ఇప్పటినుంచే..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా ఉండి ఉంటే తమ పార్టీ బలంగా ఉండేదని.. తద్వారా బీజేపీ ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతో బీజేపీ బలపడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ సోనియాను కూడా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోవడం వల్లే బీజేపీ బలపడిందని.. అందుకు కేసీఆరే కారణమని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్