Homeఎంటర్టైన్మెంట్రివ్యూ : క్రాక్ - ఓన్లీ మాస్ కు మాత్రమే !

రివ్యూ : క్రాక్ – ఓన్లీ మాస్ కు మాత్రమే !

Krack Review

నటీనటులు: రవితేజ, శ్రుతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, అప్సర రాణి తదితరులు
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నిర్మాత: ఠాగూర్ మధు
సంగీత దర్శకుడు: తమన్ ఎస్

Also Read: చరిత్ర సృష్టించిన కేజీఎఫ్2: 100 మిలియన్ వ్యూస్ దాటేశారు

మాస్‌ మహారాజా ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’ పరిస్థితి ఏమిటి ? సినిమా ఎలా ఉంది ? అనే విషయాలను అనవసర వివరణలు, ఉపోద్ఘాతాలతో సాగదీయకుండా.. డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్తే.. కేవలం మాస్‍ ఆడియన్స్ ను టార్గెట్ గా ఈ సినిమాని తీశారు. దాంతో కథలో కొత్తదనం మిస్ అయింది, కాకపోతే ఉన్న కథ ప్రెజెంటేషన్‍లో కొత్తదనం కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ, ఈ సినిమా కథను ఎక్కడ మొదలు పెట్టాలో, హీరోని ఎక్కడా యాక్షన్‍లోకి దించాలో అర్ధం కాక, దర్శకుడు కాసేపు కామెడీని చేయిస్తూ టైం పాస్ చేసుకుంటూ పోయాడు.

అందుకే కొన్ని సన్నివేశాల్లో అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అయినా కనిపించిన ప్రతిసారి రవితేజకి ఇచ్చే ఓవర్ బిల్డప్ ఇంట్రడక్షన్‍ లు కూడా చికాకు పుట్టించాయి. దర్శకుడు గోపిచంద్‍ మలినేనికి ఉన్న మరో బలహీనత.. ఏ సన్నివేశం ఎంత చూపించాలి అనేది తెలియదు. ఆయన తెలివి తేటలు ఎంత సేపూ ఉన్న సినిమాల నుండి కాపీ కొట్టి షాట్స్ తీయడం తప్ప.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాత్రం సినిమాని తీయలేదు.

Also Read: పిల్లలే పెళ్లి పెద్దలుగా సింగర్ సునీత పెళ్లి

ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. రవితేజ తన ఎనర్జీ పెర్ఫార్మన్స్ తో పాటు తన టైమింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఇక లుక్స్ పరంగా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ పాత్రలో నటించిన శృతి హాసన్ చాలా బాగా నటించింది.

ఆమె తన పాత్రలో తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. ఇక ఈ చిత్రం నేపథ్యం కూడా చాలా బాగుంది. మాస్ ఎలిమెంట్స్ తో నేపథ్యం కుదరడం, పైగా కమర్షియల్ అంశాలతో పర్ఫెక్ట్ గా సినిమా ప్యాక్ చేయడం ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ సినిమాలు ఇష్టపడేవారికి చాల బాగా నచ్చుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version