
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. తెలంగాణ రాష్ర్ట సమితి (టీఅర్ఎస్) అధిష్టానం భావించిందే తడవుగా రాష్ర్ట అారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వేటు వేసింది. రాజకీయ దురంధరుడుగా పేరుగాంచిన ఈటల భవితవ్యం డోలాయమానంలో పడింది. అనుభవజ్జుడుగా, ప్రధాన అనుచరుడిగా భావించిన ఈటలపై ఇంత విద్వే్శపూపరితంగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యచకితులను చేస్తోంది. సెకండరీగా పిలువబడుతున్న ఈటలపై రాజకీయ కక్షతోనే ఇలా చేశారనేది పలువురి అభిప్రాయం. టీఆర్ఎస్ లో రోజురోజుకు పట్టు పెంచుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఇలా జరగడం యాదృశ్చికం కాదు. రాజకీయ దురుద్దేశంతోనే కావాలనే బురదజల్లే ప్రయత్నంలో భాగంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వెనుక పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూస్తున్నాయనేది నిర్వివాదాంశం.
టీఆర్ఎస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న వారిని పక్కకు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరగడం తెలిసిందే. ప్రధానంగా రెండో స్థాయిలో ఉన్న ఆలె నరేంద్రను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తాటికొండ రాజయ్యను కూడా ఇదే తరహాలో పక్కకు పెట్టడం విదితమే. పార్టీలో చేరిన అనతికాలంలోనే విజయశాంతిని కూడా సస్పెండ్ చేయడం అందరికీ సుపరిచితమే.
ఏది ఏమైనా టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయనే తెలుస్తోంది. ఇన్నాళ్లూ చాటుమాటుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమైట్లు సమాచారం. పార్టీలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై వేటు వేస్తారనేది నిజం. ప్రస్తుతం ఈటల రాజేందర్ పై కూడా ఇదే తరహాలో వెన్నుపోటు పొడిచారనేది సమాచారం. కాలక్రమేణా పార్టీలో కుయుక్తులు మొదలయ్యాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీ భవితవ్యం అగమ్యగోచరంలో పడిపోతుందనే వాదన వినిపిస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. పార్టీకి అనితర సేవలందించిన ఈటలపరాజకీయ దృష్టితోనే అభియోగాలు ఆపాదించినట్లు తెలుస్తోంది. రాజేందర్ పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే అప్పుడు కృష్ణుడుగా కనిపించిన వాడు ఇప్పుడు నికృష్ణుడు ఎలా అయ్యాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూకబ్జా నేరాన్ని ఆపాదించి మంత్రిని బాధ్యతల నుంచి తప్పించాలని చూడడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లిస్తుందనేది జగమెరిగిన సత్యం.