అందానికి, మధురమైన గాత్రానికి సింగర్ సునీత ప్రతిరూపంలా అనిపిస్తోంది. ఆమెను ఇష్టపడనివారు లేరు. అయితే, ఆ ఇష్టాల్లో తేడా చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఓ సినిమాకు డబ్బంగ్ చెప్పడానికి స్టూడియోకి వెళ్ళింది. అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న ఆ సినిమా డైరెక్టర్ ఆమె రాగానే ఎదురువెళ్లి ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లాడు.
ఆ సయమంలో సునీతతో ఆ డైరెక్టర్ వ్యవహరించిన తీరుకు సునీత ఇప్పటికీ షాక్ గానే ఫీల్ అవుతూ ఉంటుందట. అసలు విషయాన్ని సునీత మాటల్లోనే.. ‘నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు సింపుల్ గానే వెళ్తాను. అలా నేను స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ సినిమా దర్శకుడు హాలో మేడమ్ అంటూ నన్ను రిసీవ్ చేసుకుని, నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.
మా పరిచయం పూర్తయ్యాక కాసేపు బాగానే మాట్లాడిన అతను, ఉన్నట్టు ఉండి వెంటనే నన్ను సునీత అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ తరువాత కొన్ని డబ్బింగ్ సెషన్స్ ముగిసాక, అతని ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది. చనువుగా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆ డైరెక్టర్ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరేయ్, కన్నా, బుజ్జి అని పిలవడం మొదలెట్టాడు. అల ఆ డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు
అసలు అతని మాటలు అతని ప్రవర్తన చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్, బుజ్జి అంటూ ఎలా పిలుస్తున్నాడు అంటూ నేను షాక్ అయ్యాను. అతని ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం అయ్యాక, నాకు చిరాగ్గా అనిపించింది. అయితే, అక్కడి నుండి నేను వచ్చే వరకూ అతను నా వెంటే ఉన్నాడు. నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆ డైరెక్టర్ ను కలిసే అవకాశం రాలేదు’ అంటూ సునీత తనకు ఎదురైన చేదు సంఘటన గుర్తు చేసుకుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు ఆమె.