CBI: రాష్ట్రాలకు సీబీఐపై నమ్మకం ఉందో లేదో తెలుసుకునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు సైతం పంపింది. ఈ అభిప్రాయాలను కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. తమ రాష్ట్రంలోని సీఐబీ రావొద్దంటూ చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కన్సెంట్‌ను రద్దు చేస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రాల్లోకి సీబీఐ ఎంట్రీ అవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రాలు ఇలా కన్సంట్ ను రద్దు చేస్తుండటంతో అసలు సీబీఐపై నమ్మకం ఉందా లేదా అనే విషయంపై కేంద్రం స్పష్టత కోరుకుంటోంది. నమ్మకం లేదనే కదా కన్సంట్‌ను పలు రాష్ట్రాలు రద్దు చేసింది. పంజరంలో చిలకలా సీబీఐ మారిపోయిందంటూ కోర్టులు చాలా సందర్భాల్లో తెలియజేశాయి.

గడిచిన ఏడు సంవత్సరాల్లో కేంద్ర దర్యాప్తుసంస్థలు దాదాపుగా దారిని తప్పాయంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి చెందిన లీడర్లను కాపాడుతూ.. ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటం తప్ప దర్యాప్తుసంస్థలు చేస్తున్నది ఏమీ లేదనే అభిప్రాయము ఎక్కువ మందిలో ఉంది. కేసుల నమోదు, విచారణ, దాడులు, సోదాలు ఇలాంటివే అందుకు ఉదాహరణగా మారుతున్నాయి. చాలా మందిపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. కానీ వారు కాషాయ కండువా కప్పుకున్నాక ఆ కేసులు తెరమీదకు రావడం లేదు. బెంగాల్ రాష్ట్రం లాంటి ప్రాంతాల్లో సీబీఐ చేసిన హడావుడి తెలిసిందే. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే సీబీఐ నమ్మకముంది. వాస్తవానికి నిజాలేంటనేది కేంద్రానికి తెలుసు. కానీ కానీ నామమత్రంగా అభిప్రాయాలు తెలుసుకోవాలి కావున అభిప్రాయాల కోసం రాష్ట్రాలను అడుగుతుంది కేంద్రం. వాస్తవానికి సీబీఐ అనేది ఓ స్వతంత్ర సంస్థ.. ప్రస్తుతం దాని స్వతంత్రాన్ని రాజకీయం లాగేసుకుంటున్నది. ఇప్పుడు అధికారంలో ఉన్న వారు తమ కంటి సైగతో సీబీఐ నడిపిస్తున్నారు. ప్రత్యర్థులపైకి ఉసిగొలుపుతున్నారు. మరి తర్వాత ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే.. వారి ప్రత్యర్థులను ఆడించేందుకు సీబీఐను అడ్డుపెట్టుకుంటారు. ఇలా స్వలాభం కోసం సీబీఐను అడ్డుపెట్టుకుని దేశానికి ద్రోహం చేస్తున్నారు.
Also Read: China borders: సరిహద్దుల్లో ఖాళీ అవుతున్న గ్రామాలు.. ఎందుకంటే?