https://oktelugu.com/

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…

Victory Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం నుంచి ట్విట్టర్ లో వెంకటేష్ పేరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మేరకు ఆయన నటిస్తున్న పలు సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రావడంతో వెంకటేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 06:45 PM IST
    Follow us on

    Victory Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం నుంచి ట్విట్టర్ లో వెంకటేష్ పేరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మేరకు ఆయన నటిస్తున్న పలు సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రావడంతో వెంకటేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రానాతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజున ప్రత్యేకంగా విష్ చేస్తూ ట్వీట్లు చేశారు.

    61 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న వెంకీ మామపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమ, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి “ఎఫ్ 3” మూవీలో నటిస్తున్నాడు. అలానే తన అన్న కొడుకు రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ చేస్తున్నారు.