హైకోర్టుకు చేరిన సుధాకర్ రావు వ్యవహారం..!

నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నెల 16న పోలీసులు సుధాకర్ రావుపై అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ రైల్యే మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలతో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖనే సుమోటో పిల్ గా స్వీకరించిన ధర్మాసనం వైద్యుడు సుధాకర్ రావును తన ముందు హాజరు పరచాలని ప్రభుత్వాన్ని […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 9:53 am
Follow us on


నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నెల 16న పోలీసులు సుధాకర్ రావుపై అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ రైల్యే మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలతో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖనే సుమోటో పిల్ గా స్వీకరించిన ధర్మాసనం వైద్యుడు సుధాకర్ రావును తన ముందు హాజరు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని పార్టీలు భావిస్తున్నామని ప్రభుత్వ ఏజి ధర్మాసనానికి వివరించారు. అనిత అందించిన వీడియో ఎడిట్ చేయబడిందని, సుధాకర్ రావు మద్యం సేవించి కనిపించిన వారందరినీ అసభ్యకరంగా దూషించాడని, ప్రధాని, ముఖ్యమంత్రిలను అదేవిధంగా దూషించాడని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

అదేవిధంగా మచిలీపట్నంలో మడ అడవుల నరికివేతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని ఇద్దరు మత్స్యకారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అడవి నరికివేత చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో అడవుల నరికివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.