General Bipin Rawat: వీర జవాన్ భరత మాత ఒడిలోకి వెళ్లాడు. భారత సైన్యంలో నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మృతి పట్ల దేశ ప్రజానీకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ యాక్సిడెంట్‌లో బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ జీవితంపై స్పెషల్ ఫోకస్..

తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ కుప్పకూలగా అక్కడే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ప్రాణాలు కోల్పోయారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో బిపిన్ రావత్ చనిపోయారు. బిపిన్ రావత్ ఆ కాలేజ్ పూర్వ విద్యార్థి.
ఉత్తరాఖాండ్ స్టేట్‌లోని పౌరీ జిల్లాలో బిపిన్ రావత్ జన్మించారు. డెహ్రాడూన్‌లోని కాంబ్రియాల్ హాల్ స్కూల్, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్‌లో బిపిన్ చదువుకున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత బిపిన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ లోఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో బిపిన్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లిన బిపిన్ అక్కడ హయ్యర్ కమాండ్ కోర్స్ కంప్లీట్ చేశారు. అనంతరం దేవీ అహల్య యూనివర్సిటీలో బిపిన్ రావత్ ఎంఫిల్ చదివారు. భారత సైన్యాధ్యక్షుడిగా బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలను అందించారు.
Also Read: PM Modi: బిపిన్ రావత్.. అందుకే ప్రధాని మోడీకి ఇష్టమట..
నాలుగు దశాబ్దాల తన సర్వీస్‌లో బిపిన్ రావత్ ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. హిందూ గర్వాలీ రాజ్ పుత్ ఫ్యామిలీలో జన్మించిన బిపిన్ తండ్రి కూడా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పని చేయడం గమనార్హం. భారత తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ విశేష సేవలందించారు. బిపిన్ సేవలకు ఇండియన్ మిలిటరీ అకాడమీ ‘స్వార్ద్ ఆఫ్ ఆనర్’ అవార్డు ఇచ్చింది. 1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్.. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్స్ నిర్వహించారు. 2016 లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్.. నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు బిపిన్ రావత్ నేతృత్వం వహించారు. తన సేవలకు ఎన్నో పతకాలు అందుకున్న బిపిన్ రావత్..భారతదేశం కోసం ఎనలేని త్యాగం చేశారు. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సటీ నుంచి డాక్టరేట్ పొందారు బిపిన్ రావత్.
Also Read: Bipin Rawath: బిపిన్ రావత్ మరణం అనుమానాస్పదం.. బాంబు పేల్చిన సుబ్రహ్మణస్వామి