అప్పటివరకు స్కూళ్లు తెరవొద్దు.. కేంద్రం ఆదేశం

దాదాపు ఆరేడు నెలలుగా విద్యార్థులంతా ఇంటికే పరిమితం కావడంతో వారికి బోర్ కొట్టి చస్తోంది. బయటకు వెళితే కరోనా భయం ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిల్లల అల్లరి హద్దులు దాటుతున్నా భరిస్తున్నారు. ఇల్లు పీకి పందిరేస్తున్న పిల్లలను సహిస్తున్నారు. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారు దేవుడా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నాయి. అయితే కరోనా భయానికి ఉగ్గపట్టుకొని ఉంటున్నారు. Also Read: అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా? పిల్లల చదువులు పోతున్నా.. వారి […]

Written By: NARESH, Updated On : October 28, 2020 3:19 pm
Follow us on

దాదాపు ఆరేడు నెలలుగా విద్యార్థులంతా ఇంటికే పరిమితం కావడంతో వారికి బోర్ కొట్టి చస్తోంది. బయటకు వెళితే కరోనా భయం ఉండడంతో పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిల్లల అల్లరి హద్దులు దాటుతున్నా భరిస్తున్నారు. ఇల్లు పీకి పందిరేస్తున్న పిల్లలను సహిస్తున్నారు. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారు దేవుడా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నాయి. అయితే కరోనా భయానికి ఉగ్గపట్టుకొని ఉంటున్నారు.

Also Read: అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా?

పిల్లల చదువులు పోతున్నా.. వారి అల్లరి మితిమిరుతున్నా కూడా.. తల్లిదండ్రులు వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లలను పాఠశాలలు పంపడానికి ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 80శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలలకు పంపమని సర్వేలో స్పష్టం చేశారు. కరోనా కారణంగా కేంద్రం కూడా అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నవంబర్ 30 వరకు స్కూళ్లు తెరవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అన్ లాక్ 5లో భాగంగా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ తాజాగా జారీ చేసింది. తాజాగా నవంబర్ 30 వరకూ స్కూళ్లు తెరవడానికి వీల్లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు పిల్లలు వస్తే కరోనా విజృంభిస్తే పసిపిల్లల ప్రాణాలకు భద్రత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టలేమని కేంద్రం భావిస్తోంది.

Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?

కరోనాను అందరూ లైట్ తీసుకుంటుండడంతో స్కూల్స్ పై నిర్ణయాధికారాన్ని మొదట కేంద్రం రాష్ట్రాలకే కట్టబెట్టింది. తాజాగా అన్ లాక్5లో ఈ మేరకు సడలింపులు ఇచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలిచ్చినా సరే స్కూళ్లు తెరవడంపై రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ తెరుస్తామని ప్రకటించింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా పాఠశాలలు తెరవడానికి రెడీ అయ్యాయి. అయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్రం నవంబర్ 30 వరకు స్కూల్స్ తెరవొద్దని తాజాగా ఆదేశించింది.