https://oktelugu.com/

తొమ్మిది హత్యల కేసులో నిందితుడికి ఉరిశిక్ష

వరంగల్‌లో గత మే నెలలో తొమ్మది మంది చావుకు కారణమైన కేసులో వరంగల్‌ అదనపు సెషన్స్‌ కోర్టు బుదవారం సంచలన తీర్పు వెల్లడించింది. నింతితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్‌ తీర్పు ప్రకటించారు. గత మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్‌ బావిలో పడేశారు. తెల్లారి వరుసగా 9 మంది మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. 25 రోజుల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు 57 […]

Written By: , Updated On : October 28, 2020 / 02:44 PM IST
Follow us on

వరంగల్‌లో గత మే నెలలో తొమ్మది మంది చావుకు కారణమైన కేసులో వరంగల్‌ అదనపు సెషన్స్‌ కోర్టు బుదవారం సంచలన తీర్పు వెల్లడించింది. నింతితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్‌ తీర్పు ప్రకటించారు. గత మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్‌ బావిలో పడేశారు. తెల్లారి వరుసగా 9 మంది మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. 25 రోజుల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు 57 మంది వాంగ్మూలం తీసుకున్నారు. చివరగా ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు నిరూపణ కావడంతో నిందితుడికి ఉరిశిక్ష విధించారు.