
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు హిందువుల గురించి మాట్లాడే ఆయన ముస్లింల గురించి మాట్లాడడం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ముస్లిం మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగంలో చాలా మంది సంఘ్ కేవలం హిందువులకే పరిమితమని భావిస్తారు. కానీ అందులో ముస్లిం విభాగం కూడా ఉంది. మైనార్టీల హక్కుల కోసం ఇది పోరాడుతుంది.
ఇంతకీ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలేమిటంటే భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని చెప్పారు. హిందువులు, ముస్లింలు అనే తేడా ఉండదని తేల్చిచెప్పారు. ఇస్లాం ప్రమాదంలో ఉందని అన్నారు. హిందుస్థానీ ఫస్ట్ హిందుస్థాన్ ఫస్ట్ అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ముస్లింల ఐక్యత భిన్నంగా లేదని మతంతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్ఏ ఒకేలా ఉంటుందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో హిందువులు, ముస్లింలు అనే తేడా ఉండదని అన్నారు. అందరు భారతీయులమనే గుర్తుంచుకోవాలని సూచించారు. అమాయకులపై దాడులు చేయడం సముచితం కాదని చెప్పారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం పేరుతో విడగొట్టవద్దని చెప్పారు. అందరు సంయమనంతో పాటించాలని పేర్కొన్నారు.
భారతదేశంలో ముస్లింలకు స్థానం లేదని చెప్పే ఏ హిందువు కూడా అసలైన హిందువు కాదన్నారు. ఆవు ఎంతో పవిత్రమైన జంతువు అన్నారు. దేశాన్ని బలోపేతం చేయడానికి సమాజంలోని అందరి సంక్షేమం కోసం సంఘ్ పరివార్ తన పని తాను చేస్తుందన్నారు. ఇతరుల్ని కించపరిచే వ్యక్తులు హిందూత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారన్నారు. ముస్లింలకు సంఘ్ మీద, బీజేపీ పైన భయంపెట్టుకోకూడదని సూచించారు.
బీజేపీ, సంఘ్ పరివార్ విస్తరించాలంటే మైనార్టీల అండ అవసరమని గుర్తించి ఈ రకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే యూపీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలంటే అందరి అవసరం ఉందని గుర్తించే ముస్లింలను స్నేహితులుగా చెబుతున్నారని సమాచారం. బీజేపీలో హిందుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని కానీ ముస్లింలను చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు.