https://oktelugu.com/

Delhi : ఢిల్లీవాసులను భయపెడుతున్న దీపావళి.. 72 గంటలు గడిస్తే గండం గట్టెక్కినట్లే.. అలర్ట్‌ ప్రకటించిన సీపీసీబీ!

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీపావళి సందర్భంగా ఏటా కాలుష్యం పెరుగుతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే పరిస్థితి దారుణంగా తయారైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 29, 2024 / 03:28 PM IST

    Delhi

    Follow us on

    Delhi :  దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యపు కోరల్లో విలవిలలాడుతోంది. ఊపిరి పీల్చుకోడడానికి కూడా ప్రజలు ఇబ్బంది డుతున్నారు. ఏటా శీతాకాలంలో ఈ సమస్య అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఏటా దీపావళి నుంచి సమస్య మొదలవుతుంది. కానీ, ఈ ఏడాది దీపావలికి ముందు నుంచే ఢిల్లీ వాసులు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌లో రైతులు పంట వ్యార్థాలను కాలుస్తున్నారు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిన అక్కడి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రెండు రాస్ట్రాల్లోని పొగ… ఢిల్లీని కమ్మేస్తోంది. గాలిని కలుషితం చేస్తోంది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరోవైపు దీపావళి సందర్భంగా టపాసులు కాల్చొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టాపాసుల విక్రయాలపై నిషేధం విధించింది.

    72 గంటలు కీలకం..
    దీపావళి అంటే.. అందరూ సంబరపడతారు. కానీ దీపావళి అంటే ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. పండుగ సందర్భంగా కాల్చే టపాసులతో గాలి నాణ్యత పడిపోతోంది. ఊపిరి పీల్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది దీపావళికి ముందే ఢిలీలో కాలుష్యం విషం కక్కుతోంది. తాజాగా దీపావళి పండుగ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో రాబోయే 72 గంటలు చాలా కీలకమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో బాణాసంచ కాల్చడంపై నిషేధం ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో టాపసులు కాలుస్తారు. ఇక పొరుగున్న ఉన్న హర్యానా, పంజాబ్‌లో బాణాసంచ కాల్చడంపై నిషేధం లేదు. అక్కడ కాల్చడం వలన వెలువడే పొగ, రాసాయనాలతో కలుషితమైన గాలి ఢిల్లీవైపు వెళ్తుంది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళనవ యక్తం చేస్తున్నారు. కాలుష్యానికి తోడు పొగమంచు కూడా ఢిల్లీ వసులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత 300 దాటుతోంది. మంగళవారం(అక్టోబర్‌ 29న) ఉదయం ఏక్యూ 274గా నమోదైంది. దీపావలి నేపథ్యంలో ఢిల్లీలో గాలి నాణ్యత రాబోయే మూడు రోజుల్లో 400 దాటే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

    వాహనాల పొగ..
    ఒకవైపు పొగ మంచు.. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న విషపూరిత గాలి. ఇక రాష్ట్రంలోని వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. వీటికి దీపావళి టపాసుల గాలి, పొగ తోడైతే పరిస్థితి చేయి దాటిపోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రేప్‌–1, గ్రూప్‌–2 నిబంధనలు అమలు చేస్తోంది. సోమవారం వీచిన ఆగ్నేయ గాలుల కారణంగా కాలుష్యం కాస్త తగ్గింది. అయితే దీపావళే.. ఢిల్లీ వసులను భయపెడుతోంది.