Australia : ఆమెను హత్యచేసినవాడిని పట్టిస్తే.. ఐదున్నర కోట్ల బహుమతి!

ఇటీవలి కాలంలో హత్యలు, అత్యాచారాలు సాధారణం అయ్యాయి. మద్యం, డ్రగ్స్, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిందితులను పోలీసులు వారం పది రోజుల్లో పట్టుకుంటున్నారు. కానీ, ఓ హత్య కేసును పదేళ్లైనా ఛేదించలేదు.

Written By: Raj Shekar, Updated On : October 29, 2024 3:10 pm

Prabha Arunkumar

Follow us on

Australia : సమాజంలో విష సంస్కృతి పెరుగుతోంది. మద్యపానం, డ్రగ్స్‌ అలవాట్లు పెరుగుతున్నాయి. దీంతో అనుబంధాలు, బంధాలను మర్చిపోతున్నారు. వావి వరసలను కూడా పట్టించుకోవడం లేదు. అయినవారు, కానివారు అనే బేధం చూడడం లేదు. తాము అనుకున్నది కాకపోయినా.. అడిగింది ఇవ్వకపోయినా దాడి చేస్తున్నారు. చివరకు చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఆవేశంలో చేసే అనర్థాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల నియంత్రణకు ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేస్తున్నాయి. పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయినా భయం ఉండడం లేదు. నేరం చేసినవారిని పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. అయితే ఓ హత్య కేసును మాత్రం పోలీసులు పదేళ్లు కావొస్తున్నా ఛేదించలేదు. హత్య చేసింది నిందితుడిని పట్టుకోలేదు. కనీసం హత్య చేసింది ఎవరు అనేది కూడా గుర్తించలేదు. హత్యకు గురైంది భారతీయురాలే. కానీ కేసును ఛేదించలేకపోయింది ఆస్ట్రేలియా పోలీసులు.

ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్‌(41) 2015, మార్చి 7న హత్యకు గురైంది. బెంగళూరుకు చెందిన ఆమె గొంతులో కత్తితో పొడిచిన దుండకులు హత్య చేశారు. హత్య జరిగి పదేళ్లు అయినా ఇప్పటి వరకు హంతకుడి వివరాలు కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఇన్నాళ్లకు తమ నిస్సహాయతను ఆస్ట్రేలియా పోలీసులు అంగీకరించారు. హత్య వివరాలు, ఆచూకీ చెప్పి వారికి మిలియన్‌ డాలర్ల బహుమతి ప్రకటించారు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసులు. ఈ బహుమతి భారతీయ కరెన్సీలో రూ.5.57 కోట్లకు సమానం.

ఇంటికి వస్తుండగా దారుణం..
బెంగళూరులోని హైండ్‌ ట్రీ కంపనీలో ఉద్యోగం చేసే ప్రభా అరుణ్‌కుమార్‌ విధి నిర్వహణలో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లారు. 2015, మార్చి 7న విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది. భర్తతో ఫోన్‌ మాట్లాడుతూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా తనను ఎవరు వెంబడిస్తున్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఫోన్‌లో భర్తకు తెలిపింది. తర్వాత ఫోన్‌ కట్‌చేసింది. కానీ, తన ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో హత్యకు గురైంది. ఆమెను ఎవరు వెంబడించారు… ఎందుకు హత్య చేశారు అనే విషయాన్ని ఆస్ట్రేలియా పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు.

తమ వల్ల కావడం లేదని..
ఇన్నాళ్లకు పోలీసులు కేసును ఛేదించడం తమ వల్ల కావడం లేదని అంగీకరించారు. తమ నిస్సహాయతను అంగీకరించడానికి పదేళ్లు పట్టింది. ఇప్పుడు తాపీగా నగదు బహుమతి ఇస్తాం.. వివరాలు, హంతకుడి ఆచూకీ చెప్పండి అని క ఓరుతున్నారు. దీనిపై ప్రభా అరుణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతోపాటు నెటిజన్లు మండిపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే ఆస్ట్రేలియా ఓ హత్య కేసును ఛేదించలేకపోవడంపై మండిపడుతున్నారు. మరోవైపు హత్య కేసును ఛేదించేందుకు భారత్, ఆస్ట్రేలియాలో వేట మొదలైంది.