Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ దాదాపు సగం కంప్లీట్ అయ్యింది. ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. ఐదు వారాల అనంతరం మరో 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటివారం ఎలిమినేట్ అయ్యింది. శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్ వరుసగా ఇంటిని వీడారు.
తొమ్మిదవ వారానికి గాను సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే అధికారం బిగ్ బాస్ మెగా చీఫ్ గా ఉన్న విష్ణుప్రియకు ఇచ్చాడు. వాడివేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నయని పావని, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. కాగా ఓటింగ్ లో అనూహ్య ఫలితాలు నమోదు అవుతున్నాయి.
యష్మి టాప్ లో ట్రెండ్ అవుతున్నట్లు సమాచారం. ఆమెకు 32 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందట. యష్మి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రోజే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ కాదు. ఈ అంశం ఆమెకు బాగా కలిసొస్తుంది. నామినేషన్స్ లో ఉన్న మిగతా నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావడం విశేషం. సీరియల్ నటిగా ఆమెకు కొంత ఫేమ్ ఉంది. గేమ్ పరంగా కూడా పర్వాలేదు. ఈ క్రమంలో యష్మి ఓటింగ్ లో దూసుకుపోతుందట.
అనంతరం రెండో స్థానంలో గౌతమ్ ఉన్నాడట. గౌతమ్ సీజన్ 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 7వ వారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ సేఫ్ అయ్యాడు. ఈ వారం మాత్రం అతడు సేఫ్ జోన్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట. ఇతడు కూడా సీజన్ 7 కంటెస్టెంట్. 9వారాలు హౌస్లో ఉన్నాడు. వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ కి వచ్చాడు.
టేస్టీ తేజ మంచి ఎంటర్టైనర్. ఆ కోణంలో అతడికి ఓట్లు పడుతున్నాయి. ఇక చివరి రెండు స్థానాల్లో నయని పావని, హరితేజ ఉన్నారట. తాజా ఓటింగ్ ప్రకారం వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇంకా ఓటింగ్ కి సమయం ఉంది. సమీకరణాలు మారే అవకాశం ఉంది.