https://oktelugu.com/

జిల్లాల విభజన.. సందిగ్ధంలో వైసీపీ నేత?

తెలంగాణలోని పది జిల్లాలు కాస్తా 33 జిల్లాలు అయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే జిల్లాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండానే తెలంగాణలో జిల్లాల ప్రక్రియను సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. నాటి నుంచే ఏపీలో కొత్త జిల్లాలపై చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల తేనే తట్టును కదిపేందుకు సాహసించ లేకపోయాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 06:33 PM IST
    Follow us on


    తెలంగాణలోని పది జిల్లాలు కాస్తా 33 జిల్లాలు అయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే జిల్లాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండానే తెలంగాణలో జిల్లాల ప్రక్రియను సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. నాటి నుంచే ఏపీలో కొత్త జిల్లాలపై చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల తేనే తట్టును కదిపేందుకు సాహసించ లేకపోయాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లు ప్రతీ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా చేసేందుకు వైసీపీ సర్కార్ ముందుకెళుతోంది.

    Also Read: వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!

    ఇటీవలే జగన్ సీఎంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాదంతా సంక్షేమ కార్యక్రమాలతో గడిచిపోయింది. ఇక రెండో ఏడాది ప్రారంభంలోనే సీఎం జగన్ కొత్తజిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఓవైపు కరోనా కట్టడికి చర్యలు చేపడుతూనే మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం యంత్రాంగం వేగంగా పని చేస్తోంది. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల రెవిన్యూ అధికారులతో చర్చించి అన్ని మండలాల వారీగా నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంది. అయితే జిల్లాల విభజనతో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో లబ్దిచేకూరడంతోపాటు టీడీపీ పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

    అయితే వైసీపీకి చెందిన ఓ నేత మాత్రం జిల్లాల విభజనపై కలవరం చెందుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇబ్బందిగా మారనుందట. వేణుగోపాలరెడ్డి తొలి నుంచి గుంటూరులో రాజ‌కీయాలు చేయాల‌ని అనుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇందుకోసం గ‌తేడాది పార్టీ మారడంతోపాటు.. ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ తీసుకున్నారట. అయితే ఇప్పడు జిల్లాల విభజన ఆయనకు ఇరకాటంలో పడేయనుందని టాక్ విన్పిస్తుంది.

    Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

    కొత్త జిల్లాల ఏర్పాటుతో గుంటూరు జిల్లాను పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విభ‌జిస్తే మూడుగా మారనుంది. దీంతో గుంటూరు, బాప‌ట్ల‌, న‌ర‌స‌రావుపేటలు జిల్లాలుగా ఏర్ప‌డ‌నున్నాయి. అయితే మోదుగుల ఓటుహ‌క్కు మాత్రం ప్రస్తుతం న‌ర‌స‌రావుపేట‌లో ఉంది. దీంతో ఆయ‌న ఆ జిల్లా ప‌రిధిలోకి వెళ్లిపోతారు. దీంతో ఆయన గుంటూరులో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పాలంటే ఇబ్బందులు ఏర్పడనున్నాయట. అలాగే అక్కడ క‌మ్మవ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఎక్కువ‌ ఉండటంతో గుంటూరులో ఉండలా? లేక త‌న‌ను గతంలో గెలిపించిన న‌ర‌స‌రావుపేటకు వెళ్లాలా? అనేది తేల్చుకోలేక పోతున్నారట. దీంతో మోదుగుల రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నేతల్లో నెలకొంది.