https://oktelugu.com/

సిక్స్‌ ప్యాక్‌తో సక్సెస్‌కు ‘గురి’ పెట్టిన నాగశౌర్య

యువ కథానాయకుడు నాగశౌర్య మారిపోయాడు. బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్లూ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా కనిపించిన అతను తనపేరులోని శౌర్యాన్ని తెరపై చూపించేందుకు సిద్దమవుతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ రోజు (సోమవారం) సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. చొక్క లేకుండా సిక్స్‌ బ్యాక్‌ బాడీ.. లాంగ్‌ హెయిర్ స్టయిల్‌తో శౌర్య […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 06:45 PM IST
    Follow us on


    యువ కథానాయకుడు నాగశౌర్య మారిపోయాడు. బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్లూ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా కనిపించిన అతను తనపేరులోని శౌర్యాన్ని తెరపై చూపించేందుకు సిద్దమవుతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ రోజు (సోమవారం) సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. చొక్క లేకుండా సిక్స్‌ బ్యాక్‌ బాడీ.. లాంగ్‌ హెయిర్ స్టయిల్‌తో శౌర్య లుక్‌ అదిరిపోయింది. ఎడమ చేతిపై బాణం పచ్చబొట్టు.. నడుంపై భాగంలో గాయం నుంచి రక్తం కారుతుండగా.. చేతికి బ్యాండేజీ వేసుకొని మరీ బాణాన్ని ఎక్కుపెడుతూ కనిపించాడు శౌర్య. ఈ మూవీలో అతను విలువిద్య క్రీడాకారుడిగా (ఆర్చర్)గా కనిపించబోతున్నాడు. ఆ స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘ది గేమ్‌ విల్‌ నెవర్‌ బీ ది సేమ్‌’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన శౌర్య.. ‘ఇప్పుడు అతని మనస్సు, ఆత్మ కలిసిపోయాయి. లక్ష్యం అనేది ఇక చిన్న విషయం’ మాత్రమే అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

    Also Read: బిగ్‌బాస్‌4 నుంచి ఆఫర్ వచ్చింది: స్టార్ కొరియోగ్రాఫర్

    నాగశౌర్యకు ఇది 20వ మూవీ కావడం విశేషం. అతని సరసన ‘రొమాంటిక్‌’ మూవీ ఫేమ్‌ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు నారాయణ్‌ దాస్‌, రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్త నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సిక్స్‌ ప్యాక్‌ తో సర్ప్రైజ్‌ ఇవ్వడం చూసి శౌర్య ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. లవర్‌ బాయ్‌లా, సాఫ్ట్‌గా కనిపించే కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా నాగశౌర్య లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ అతనికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ‘జ్యో అచ్యుతానంద’లో శౌర్యతో కలిసి నటించిన నారా రోహిత్..‌ ‘చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నావు. ఇంకా నువ్వు మెరుగవ్వాల్సింది ఏమీ లేదు. నీతో ఎవరు మ్యాచ్‌ అవలేరు. టీమ్‌ అందరికి ఆల్‌ ద బెస్ట్’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన శేఖర్ కుమ్ముల ప్రత్యేక వీడియో సందేశం పంపించారు. నిర్మాత నారాయణదాస్‌ పుట్టిన రోజు నాడు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులపై కూడా నాగశౌర్య దృష్టి పెట్టాడు. శ్రీనివాస్‌ అవసరాల, కొత్త డైరెక్టర్ లక్ష్మి సౌజన్య తో ఈ మూవీస్‌ చేయనున్నాడు.