https://oktelugu.com/

పంచితే సరిపోదు.. అభివృద్ధి సంగతేంది జగన్‌?

ఏపీలో సీఎం జగన్‌ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ కాలంలో ఎంతకూ సంక్షేమ పథకాలపైనే ఉండిపోయిన జగన్.. అభివృద్ధిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టాడు. ఇందుకోసం కోట్లాది రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి కూడా మళ్లిస్తున్నాడు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలైతే అభివృద్ధిని పెద్దగా ఎవరూ పట్టించుకోరనేది వాస్తవం. అది జగన్‌ కూడా గ్రహించినట్లున్నారు. ఇంతవరకు ఏ నియోజకవర్గం పరిధిలో కూడా రూ.10 నుంచి రూ.15 కోట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 10:49 am
    cabinet meet jagan

    cabinet meet jagan

    Follow us on

    AP people are saying that CM Jagan is wrong ..?

    ఏపీలో సీఎం జగన్‌ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ కాలంలో ఎంతకూ సంక్షేమ పథకాలపైనే ఉండిపోయిన జగన్.. అభివృద్ధిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టాడు. ఇందుకోసం కోట్లాది రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి కూడా మళ్లిస్తున్నాడు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలైతే అభివృద్ధిని పెద్దగా ఎవరూ పట్టించుకోరనేది వాస్తవం. అది జగన్‌ కూడా గ్రహించినట్లున్నారు. ఇంతవరకు ఏ నియోజకవర్గం పరిధిలో కూడా రూ.10 నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు స్వయంగా సీఎంను కలిసి నిధుల కోసం కోరుతున్నా పెద్దగా మంజూరు కావడం లేదని సమాచారం. మరో విషయం ఏంటంటే జగన్‌ కలిసే ఛాన్స్‌ ఎమ్మెల్యేలకు కూడా దొరకడం లేదట.

    Also Read: టీడీపీ బలమే.. ఇప్పుడు బలహీనత అవుతోందా?

    కామన్‌గా.. నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎంతో కొంత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పనులు చేయాలంటే నిధులు కావాలి. తమ సమస్యల పరిష్కారానికి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుస్తున్నారు ప్రజలు, కార్యకర్తలు. ఆ సమయంలో ఆ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయి.. ఈ రోడ్డుకి నిధులు వచ్చాయి.. అంటూ తప్పించుకుంటున్నారు. కానీ ఎక్కడా ఇంతవరకు పనులు ప్రారంభించిన దాఖలాలైతే లేవు. గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప‌దే ప‌దే ఒకే ప‌నికి రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాప‌న‌లు చేయించేవారే త‌ప్ప ఆ ప‌నులు ప్రారంభం అయ్యేవి కావు. ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వంలో అలాంటి హ‌డావిడి ప్రారంభోత్సవాలు లేక‌పోయినా ప‌నులు వ‌స్తున్నాయ‌ని చెప్పడంతోనే స‌రిపెట్టేస్తున్నారు. జ‌గ‌న్ ఇప్పటి నుంచే ఓటు బ్యాంకు రాజ‌కీయాలు ప్రారంభించేశార‌ని అందుకే ఆయ‌న ప్రజ‌ల‌కు నేరుగా ల‌బ్ధి క‌లిగే సంక్షేమంతో మ‌మః అనిపిస్తూ అభివృద్ధిని పక్కన పెట్టేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అభివృద్ధి, సంక్షేమం రెండిటి మ‌ధ్య బ్యాలెన్స్ లేక‌పోతే రాష్ట్రం అధోఃగ‌తి పాల‌య్యే ఛాన్సులే ఉన్నాయి. ఇటు సంక్షేమానికి కోట్లాది కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డంతో ఏపీ ప‌రిస్థితి ఘోరంగా త‌యారైంది. చివ‌ర‌కు నెల‌వారి సాధార‌ణ ఖ‌ర్చుల‌కు సైతం భారీగా అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. రూపాయి ఖ‌ర్చులో ఏపీ ఏకంగా 55 పైస‌లు అప్పులేన‌‌ని కూడా కాగ్ నివేదిక ఇప్పటికే తేల్చేసింది. అంతేకాకుండా యేడాదిలో చేయాల్సిన అప్పులు కేవ‌లం ఐదు నెల‌ల్లోనే చేయ‌డాన్ని బట్టి చూస్తే అస‌లు భ‌విష్యత్తులో చేసే అప్పుల‌న్నీ అప్పులు క‌ట్టేందుకే స‌రిపోయే ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది.

    Also Read: ‘అదిరింది’ షోపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

    ఈ ఏడాది తొలి ఐదు నెల‌ల్లోనే ప్రభుత్వం రూ.85 వేల కోట్లు నిధులు సేక‌రించ‌గా ఇందులో రూ.47 వేల కోట్లు రుణాలే తెచ్చింది. వాస్తవంగా ఈ ఏడాది రూ.48 వేల కోట్ల రుణాలు సేక‌రించాల‌ని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంటే ఈ అప్పులన్నీ కేవ‌లం ఐదు నెల‌ల్లోనే చేసేసింది. ఎంతసేపు సంక్షేమం నడుస్తుండగా.. రాష్ట్రానికి ఇప్పటికీ స‌రైన రాజ‌ధాని అంటూ లేదు. మ‌రోవైపు ప‌రిశ్రమ‌ల ఊసే లేక‌పోవ‌డంతో రాబ‌డి నిల్‌. దీంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోవ‌డంతో ఈ ప‌రిస్థితి కంట్రోల్‌లోకి రాక‌పోతే ఏపీ ఆర్థిక వ్యవ‌స్థ మ‌రో మూడేళ్లలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. ఇటు అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని సూచిస్తున్నారు.