https://oktelugu.com/

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్ ఇదే

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అందుకే ఆ తర్వాత ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే అవుతున్నాయి. సాహో కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. Also Read: దిల్ రాజుకు హ్యాండిచ్చిన మహేష్ బాబు? ఏమైంది? ఇక సాహో తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా అది ఆగిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి ‘ఆదిపురుష్’ కాగా.. రెండోది నాగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 10:28 AM IST
    Follow us on

    బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అందుకే ఆ తర్వాత ప్రభాస్ తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే అవుతున్నాయి. సాహో కూడా దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

    Also Read: దిల్ రాజుకు హ్యాండిచ్చిన మహేష్ బాబు? ఏమైంది?

    ఇక సాహో తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కారణంగా అది ఆగిపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి ‘ఆదిపురుష్’ కాగా.. రెండోది నాగ్ అశ్విన్ మూవీ.

    ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. వైజయింతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం ఓ సరికొత్త అప్ డేట్ ను అభిమానులకు ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

    ప్రభాస్ కు జంటగా ఇప్పటికే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఈ సినిమా హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    Also Read: ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు !

    ఇక తాజాగా వచ్చిన అప్ డేట్ అంటే.. ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని తాజాగా చిత్రంయూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.