తన పాలనను వ్యతిరేకిస్తున్నారని.. తన నిర్ణయాలను అడ్డుకుంటున్నారనే కోపంతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా నాలుగు నెలల క్రితం శాసనమండలిని రద్దు చేశారు. మూడు రాజధానులు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి సభ్యులు వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్ చేయడంతో జగన్‌కు కోపం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న విషయం ఇప్పుడు సీఎం జగన్ కు అర్థమైంది. ఈ రద్దు బిల్లును అటు కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. రద్దు చేస్తూ తీర్మానం జగన్ కేంద్రానికి తీర్మానం పంపినా ఇంకా అక్కడి నుంచి రెస్పాన్స్ రావడం లేదు.
Also Read :
అయితే.. తాజా సమాచారం ప్రకారం కేంద్రం ఈ తీర్మానాన్ని ఆమోదించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి రద్దు అంశం చర్చకు వస్తుందా అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ పరిస్థితులను బట్టి చూస్తే కరోనా వైరస్ కారణంగా ఈ పార్లమెంట్ సమావేశాల రోజులను కుదించారు. ప్రశ్నోత్తరాలనూ రద్దు చేశారు. పార్లమెంటు, రాజ్యసభలు వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇన్ని నిబంధనలు ఉండటంతో ముఖ్యమైన బిల్లులు మాత్రమే చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ శాసనమండలి వ్యవస్థ మీద ముందు నుంచీ ప్రభుత్వాలకు పెద్దగా అనాసక్తితో ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా వాటిని రద్దు చేయాలంటూ చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తూనే ఉంది. కానీ.. శాసన మండలిని రద్దు చేసే విషయంపై కేంద్రం సుముఖంగా లేదు. ఈ ప్రతిపాదనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే యోచనలో ఉందట. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే శాసనమండలిపై ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రానుంది. దేశం మొత్తం మీద శాసనమండలి విషయంలో ఒకే విధానాన్ని అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయం ఎటు మలుపు తిరుగుతుందో తెలియకుండా ఉంది.
Also Read :
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు కూడా సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు 2021నాటికి శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతుండటంతో జగన్ రద్దు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అందుకే శాసనమండలి విషయంలో కేంద్రాన్ని పెద్దగా ఒత్తిడి చేయడం లేదంట. విచిత్రం ఏంటంటే.. శాసనమండలిలో ఖాళీ అవుతున్న పోస్టులను సైతం జగన్ భర్తీ చేస్తున్నారు. ఇటీవల ముగ్గురిని శాసనమండలి అభ్యర్థులగా జగన్ ఎంపిక చేశారు.