టాలీవుడ్ ఇక ఓటీటీ బాట పట్టినట్టేనా?

టాలీవుడ్లోని సినిమాలన్నీ క్రమంగా ఓటీటీ బాటపడుతున్నాయి. చిన్న సినిమాలతోపాటు పెద్దగా సినిమాలు కూడా ఇటీవలీ కాలంలో ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకొని థియేటర్లు ఓపెన్ చేస్తే విడుదల చేద్దామని అనుకుంటున్న నిర్మాతలంతా వారి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పెద్ద సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. Also Read: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సక్సెస్ దానిమీదే ఆశ కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో నిర్మాతలందరూ గత్యంతరం […]

Written By: NARESH, Updated On : September 10, 2020 12:32 pm

Tollywood in ott

Follow us on

టాలీవుడ్లోని సినిమాలన్నీ క్రమంగా ఓటీటీ బాటపడుతున్నాయి. చిన్న సినిమాలతోపాటు పెద్దగా సినిమాలు కూడా ఇటీవలీ కాలంలో ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలు పూర్తి చేసుకొని థియేటర్లు ఓపెన్ చేస్తే విడుదల చేద్దామని అనుకుంటున్న నిర్మాతలంతా వారి నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పెద్ద సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సక్సెస్ దానిమీదే ఆశ

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో నిర్మాతలందరూ గత్యంతరం లేక సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలు చిన్న సినిమాలకు వరంగా మారింది. అయితే భారీ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలకు ఓటీటీలు అంత ధర చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారంతా థియేటర్లలోనే సినిమాలు రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాలు సైతం ఓటీటీలు రిలీజ్ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.

ఇటీవలే హీరోలు నాని-సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మించారు. టాలీవుడ్ నుంచి ఓటీటీ రిలీజైన పెద్ద సినిమాగా ‘వి’ రికార్డు సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మాతకు మంచి ఫ్యాన్స్ రేట్ ఇవ్వడంతో ఆయన ఓటీటీలో రిలీజ్ చేసినట్లు తెల్సిందే. ఇక ‘వి’ సినిమా నిర్మాతకు మంచి లాభాన్ని తీసుకురాగా ఓటీటీ నిర్వాహాకులకు మాత్రం పెద్దగా కలిసి రాలేదని టాక్ వినిపిస్తోంది.

ఇక హీరో నాని బాటలోనే నితిన్ కూడా ఓటీటీ బాటపట్టినట్లు తెలుస్తోంది. కరోనాకు ముందే నితిన్ ‘భీష్మ’తో మంచి హిట్టు కొట్టి ఫామ్లోలోకి వచ్చారు. ఆయన తదుపరి చిత్రం ‘రంగ్ దే’ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం యూనిట్ ఓటీటీకే మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను మంచి రేటుకు అమ్ముడుపోయాయి. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ ను అమెజాన్ ప్రైమ్  దక్కించుకున్నట్లు సమాచారం.

Also Read: అఖిల్ మీద 70 కోట్లు అంటే.. కష్టమే !

 ఈ మూవీలో తొలిసారి నితిన్ సరసన కిర్తీ సురేష్ నటిస్తోంది. ఇటీవల కిర్తీ సురేష్ సినిమాలన్నీ కూడా ఓటీటీలోనే వస్తుండగా ‘రంగ్ దే’ సైతం రానుండటం విశేషం. వీటితోపాటు మరిన్ని సినిమాలు ఓటీటీలో వచ్చేందుకు ముస్తాబు అవుతుండటం విశేషం.