Chandrababu And Jagan: ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు అధికం. అది కాదనలేని నిజం కూడా. తెలుగుదేశం ఆవిర్భావం వరకు ఒక ఎత్తు.. తరువాత ఎత్తు అన్నట్టు పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన వర్గంగా రెడ్డి సామాజిక వర్గం ఉంది. టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండ నడుస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ కనుమరుగై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరింది. కాంగ్రెస్ మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచింది. ఆ రెండు సామాజిక వర్గాలతో పోలిస్తే మాత్రం కాపు సామాజిక వర్గం స్థిరమైన రాజకీయ నిర్ణయానికి రాలేదు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి కమ్మ, కాపు సామాజిక వర్గం కలిసిపోయాయి. రెడ్డి సామాజిక వర్గంలో చీలిక రాగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు సైలెంట్ అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గం యాక్టివ్ అయ్యింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం సైలెంట్ అయింది.
* పరిమిత నేతలు మాత్రమే..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి చాలామంది రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కమ్మ సామాజిక వర్గం మాత్రం పరిమితం. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి కొద్దిమంది నేతలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే టిడిపిలో రెడ్డి సామాజిక వర్గాన్ని గుర్తిచేస్తే ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా చేసిన కుటుంబాల నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నల్లారి కిషోర్ రెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక నేతలకు కొదువ లేదు. జెసి ఫ్యామిలీ, పల్లె రఘునాథ్ రెడ్డి, కర్నూలులో భూమా కుటుంబం, కోట్ల కుటుంబం, బైరెడ్డి కుటుంబం, చిత్తూరు జిల్లాలో బొజ్జల కుటుంబం, కడపలో రెడ్డప్ప గారి కుటుంబం, నెల్లూరులో మొత్తం రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఉంది. కానీ ఆ స్థాయిలో వైసీపీలో కమ్మ సామాజిక వర్గం ఉందా? అంటే మాత్రం లేదనే సమాధానం వస్తుంది.
* కమ్మ సామాజిక వర్గం పై వ్యతిరేకత..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) సామాజిక వర్గాల సమీకరణకు పెద్దపీట వేస్తారు. కానీ కేవలం టిడిపి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కమ్మ సామాజిక వర్గం పై వ్యతిరేకత పెంచుకున్నారు. కానీ చంద్రబాబు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజకీయ ప్రత్యర్థి. అంతవరకు ఓకే. కానీ రెడ్డి సామాజిక వర్గం పై ఆయన ఎన్నడు ద్వేషం పెంచుకోలేదు. వారికి వ్యతిరేకంగా మారలేదు. టిడిపికి వ్యతిరేకంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రెడ్డి సామాజిక వర్గం సంఘటితం అయింది. ఆ సమయంలో సైతం ఆయన సంయమనంతో వ్యవహరించి రెడ్డి సామాజిక వర్గ అభిమానాన్ని చురగొన్నారు తప్ప.. వ్యతిరేక భావన వ్యక్తం చేయలేదు.
* ఆ ఒక్క ప్రచారంతో..
తెలుగుదేశం అమరావతికి మద్దతు తెలిపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అమరావతిని నిర్వీర్యం చేయాలన్న క్రమంలో కమ్మరావతి అని ప్రచారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్. అది ఎంత మైనస్ చేసిందో తెలుసా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అప్పటివరకు కమ్మ సామాజిక వర్గంలో ఎంతో కొంత అభిమానం జగన్మోహన్ రెడ్డి పై ఉండేది. కానీ ఆ నినాదంతో తమ కులం పైనే కర్కశం నింపుతారా? అని ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అయింది. ఇప్పటికీ దానిని సరి చేయలేకపోయారు జగన్. రెడ్డి సామాజిక వర్గం చంద్రబాబు నమ్ముతోంది కానీ.. జగన్మోహన్ రెడ్డిని కమ్మ సామాజిక వర్గం నమ్మడం లేదు. దానిని నియంత్రించాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఉంది.