రజినితో హిట్ అయితే.. సీనియర్స్ కి హీరోయిన్ దొరికినట్టే !

సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న తన 168వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అసలు ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారా.. లేదా.. అని రజిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజిని వయసు రిత్యా షూటింగ్ ఇప్పట్లో చేయకపోతేనే బెటర్ అనే ఫిలింగ్ లో మేకర్స్ ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. రజిని మీద సోలో సీన్స్ […]

Written By: admin, Updated On : September 10, 2020 11:29 am
Follow us on


సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న తన 168వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అసలు ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారా.. లేదా.. అని రజిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజిని వయసు రిత్యా షూటింగ్ ఇప్పట్లో చేయకపోతేనే బెటర్ అనే ఫిలింగ్ లో మేకర్స్ ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. రజిని మీద సోలో సీన్స్ ముందుగా తీస్తారని.. ఈ సీన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటాయని.. ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన ఖుష్బూ అయితేనే బాగుంటుందని ఖుష్బూను ఒప్పించి మరీ ఈ సినిమాలో తీసుకున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సక్సెస్ దానిమీదే ఆశ

తన పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండే సరికి ఖుష్బూ కూడా ఈ సినిమా కోసం ఇరవై కిలోలు బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. పైగా ఈ వయసులో కూడా రజినితో ఓ సాంగ్ కి కూడా ఒప్పుకుంది. రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా కాస్త ఫన్నీ వేలో డిజైన్ చేశారు. నాకు కొత్తగా అనిపించింది. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఖుష్బూ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉంటుంది ఖుష్బూ. దానికితోడు బరువు తగ్గి ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లా తయారయింది. మరి రజినితో చేస్తున్న ఈ సినిమా హట్ అయితే.. సీనియర్ హీరోలకు ఖుష్బూ రూపంలో ఓ హీరోయిన్ దొరికినట్లే.

Also Read: సుశాంత్ సింగ్ కేసులో అసలు విషయం పక్కదారి పడుతోందా?

పైగా రెగ్యులర్ హీరోయిన్ లా నటించడానికి కూడా ఖుష్బూ ఏ మాత్రం మొహమాట పడే మనిషి కాదు. అయితే రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో.. దానిబట్టి ఖుష్బూకు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కానీ, రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు. ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే శివ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట.. ఇక రజిని మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. సో.. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.