https://oktelugu.com/

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి చాప్టర్ క్లోజ్… ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగింపు

Vijayasai Reddy: విశాఖ ఎయిర్ పోర్టులో ఆయన దిగిన వెంటనే ఉత్తరాంధ్ర రాజకీయాలు షేక్ అయ్యేవి. దశాబ్దల పాటు రాజకీయంగా ఏలిన నాయకులు సైతం అలెర్ఖ్ అయిపోయేవారు. ఆయన నుంచి పిలుపొచ్చిందంటే కలవరపాటుకు గురయ్యేవారు. చివరకు రాజకీయాలతో సంబంధం లేని వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాధికులను సైతం తన వద్దకు తెప్పించుకొని పంచాయతీలు నడేపేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉత్తరాంధ్ర బాద్ షా. ఆయనే ఎంపీ విజయసాయిరెడ్డి. ఉన్నట్టుండి ఆయన సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కనిపిస్తున్న […]

Written By:
  • Admin
  • , Updated On : April 19, 2022 / 09:29 AM IST
    Follow us on

    Vijayasai Reddy: విశాఖ ఎయిర్ పోర్టులో ఆయన దిగిన వెంటనే ఉత్తరాంధ్ర రాజకీయాలు షేక్ అయ్యేవి. దశాబ్దల పాటు రాజకీయంగా ఏలిన నాయకులు సైతం అలెర్ఖ్ అయిపోయేవారు. ఆయన నుంచి పిలుపొచ్చిందంటే కలవరపాటుకు గురయ్యేవారు. చివరకు రాజకీయాలతో సంబంధం లేని వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాధికులను సైతం తన వద్దకు తెప్పించుకొని పంచాయతీలు నడేపేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉత్తరాంధ్ర బాద్ షా. ఆయనే ఎంపీ విజయసాయిరెడ్డి. ఉన్నట్టుండి ఆయన సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. మొన్న మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఆయన పేరు వినిపించలేదు. కనీసం మీడియాకు సైతం కనిపించలేదు. తనకున్న ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టులు పెట్టుకొని ఉనికిని చాటుకుంటున్నారే తప్ప..జగన్ సొంత పత్రిక సాక్షిలో కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ఇంతకీ అసలు కథ ఏంటంటే ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పిస్తారన్న టాక్ నడుస్తోంది. ఆయనకు ఇకపార్టీ తరపున ఏ ఒక్క జిల్లా బాధ్యతలు కూడా ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో పార్టీ బాధ్యతలను తన సొంత వారి చేతిలో పెట్టారు జగన్. ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లాలు వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాల బాధ్యతలు సజ్జల రామక్రిష్ణారెడ్డికి, రాయలసీమ జిల్లాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అప్పగించారు.

    Vijayasai Reddy

    విశాలో ఫెయిల్
    కీలకమైన ఆర్థిక నగరం, పాలనా రాజధానిగా నిర్ణయించిన విశాఖను మాత్రం తన అనుంగ శిష్యుడు, పూర్వపు ఆడిటర్ విజయసాయి రెడ్డి చేతిలో పెట్టారు. సరైన టాస్క్ ఇచ్చారు. విశాఖ నగరంలో కీలకమైన నాలుగు నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తీరానికి చేర్చాలని సైతం ఆదేశించారు. తొలినాళ్లలో జెట్ స్పీడ్ తో పనిచేసిన విజయసాయిరెడ్డి తరువాత ఎందుకో స్లో అయ్యారు. టీడీపీ తరుపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు పార్టీలోకి తీసుకొచ్చారు. మిగతా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబులు మాత్రం కొరకరాని కొయ్యలుగా మిగిలిపోయారు. వారిని పార్టీలోకి తేలేకపోయారు. మరోవైపు నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం ఆశించిన మెజార్టీ స్థానాలు దక్కించుకోలేకపోయారు. దీంతో అప్పట్లోనే విజయసాయిరెడ్డిని విశాఖ బాధ్యతల నుంచి తప్పిస్తారన్న టాక్ నడిచింది. కానీ ఆయన కొనసాగింపు లభించింది.

    Also Read: Nellore Politics: ఒంటరైన అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు పెద్దా రెడ్ల భారీ స్కెచ్

    Vijayasai Reddy

    ఏ బాధ్యత లేదిక..
    తాజా మంత్రివర్గ విస్తరణలో 14 మంది మాజీలయ్యారు. వారందరికీ పార్టీ బాధ్యతలను అప్పగిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. రీజనల్ బాధ్యులను కూడా తప్పించనున్నారు. విజయసాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టనున్నారు. ఆయనకు కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అదీ లేకపోతే… మొత్తంగా పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంద్రలో ఆయన పార్టీని నాశనం చేశారన్న అభిప్రాయంతో సీఎం జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. పీకే టీం ద్వారా ఆయన సర్వేలు కూడా చేయించారు. చివరికి పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టనీయకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. జాబ్ మేళాలు కూడా పార్టీ హైకమాండ్ కు ఇష్టం లేదని.. కానీ విజయసాయిరెడ్డి మొండిగా పెట్టారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలెవరూ ఆయనను కలవొద్దని ముందుగానే సందేశం పంపారని చెబుతున్నారు. దాని ఫలితంగానే తిరుపతి పర్యటనలో విజయసాయిరెడ్డికి వైసీపీ కీలక నేతలు ముఖం చాటేశారు. మొత్తంగా చూస్తే.. విజయసాయిరెడ్డి పరిస్థితి వైసీపీలో రాను రాను తీసికట్టుగా మారుతోంది. రేపు రాజ్యసభ స్థానం కూడా రెన్యూవల్ చేయకపోతే.. వైసీపీలో ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్లేనని కొంత మంది చర్చించుకుంటున్నారు.

    Also Read:Shah Rukh Khan- Rajamouli: రాజమౌళితో షారుఖ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ?

    Recommended Videos

    Tags