Pranhita River: ప్రాణహిత.. అంటే ‘ప్రాణులకు మంచి చేసేది’ అని అర్థం. ఇది కొన్ని వాగుల కలయికతో ఏర్పడ్డ ఉపనది. ఎండాకాలం వస్తే అన్ని నదులు, వాగులు ఎండిపోతాయి.. కానీ సంవత్సరం పొడువునా ఎండిపోని నీటి లభ్యత గల ఏకైన నది ‘ప్రాణహిత’. అందుకే కొన్ని వేల ఏళ్ల చరిత్ర దీని సొంతం.. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ రాక్షస బల్లులు, పెద్దపులులు తిరుగాడిన నదీ తీరం అని పరిశోధనల్లో బయటపడింది. తెలంగాణ సాగు, తాగు నీటి కొరత తీరుస్తున్న ప్రాణహితకు ఇప్పుడు ‘పుష్కరాలు ’ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ప్రాణహిత’ గొప్పతనంపై స్పెషల్ స్టోరీ..
దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన నదుల్లో గోదావరి ఒకటి. కొన్ని ఉపనదుల కలయికతో గోదావరి ఉరకలేస్తుంది. చిన్న పాయగా మొదలైన గోదావరిని నదిగా మార్చే మొట్ట మొదటి ఉపనది ప్రాణహిత. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న ఈ ఉపనది కుమరం భీం జిల్లాలో మొదలవుతుంది. ఆ తరువాత కాళేశ్వం వద్ద గోదావరిలో కలుస్తుంది. భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదుల్లో ప్రాణహిత ఒకటి. ఈ ఏప్రిల్ 13 నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు నిర్వహించే పుష్కరాల్లో భాగంగా స్వచ్ఛమైన ప్రాణహితలో స్నానాలాచరించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అయితే ప్రాణహిత నదీ సమీపంలో ఒకప్పుడు రాక్షస బల్లులు తిరిగాయన్న ఆనవాళ్లు గతంలో లభించాయి. పురాణంలోనూ ‘కాళేశ్వర ఖండం’లో ప్రాణహిత నది ప్రస్తావన వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాణహిత చరిత్ర ఎంతో గొప్పదని తేలింది.
Also Read: Nellore Politics: ఒంటరైన అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు పెద్దా రెడ్ల భారీ స్కెచ్
తెలంగాణలోని కుమరం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత పుడుతుంది. వేన్ గంగా, వార్దా నదులు సంగమించి ప్రాణహిత గా మారుతుంది. సుమారు 113 కిలోమీటర్లు ప్రయాణించి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. పక్కనున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లోని విస్తారమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీరే ప్రాణహితకు ప్రాణాధారం. దాంతోనే సంవత్సరం పొడువునా ఈ నది ఎండిపోకుండా ప్రవహిస్తుంది. ఇక్కడ విశేషమైన జంతుజాలం బతకాడానికి ఈ నీరే ప్రాణాధారం ప్రాణహిత నదీ తీరాన లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ నదీ తీరంలోని వేమలనపల్లిలో జరిపిన తవ్వకాల్లో రాక్షస బల్లులు తిరిగినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. దీని ఆనవాళ్లు హైదరాబాద్ మ్యూజియంలో పెట్టారు. మిలియన్ల సంవత్సరాల చరిత్ర ఈ నేలపై నిక్షిప్తమై ఉంది.
పేరుకు ఉప నదే అయినా ప్రాణహిత ప్రధాన నదుల్లో ఒకటి. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం లెక్కల ప్రకారం గోదావరి నదిలో ప్రవహించే నీటిలో ప్రాణహిత నది 34.87 శాతం వాటా కలిగి ఉంది. గోదావరి రివర్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా విస్తీర్ణం 3,12,812 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో ప్రాణహిత క్యాచ్మెంట్ ఏరియా లక్షా పదివేల చదరపు కిలోమీటర్లు. ఈ నదిలో అనేక జలరాశులు ఉన్నాయి. సాగు, తాగు నీటి అవసరాలకు ఉపయోగించాలని నిజాం కాలం నుంచే చెబుతున్నారు.
ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో నిర్ణయించారు. జలయజ్ఞంలో భాగంగా తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కోసం శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ తరువాత క్రమంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రాజెక్టుల రీ డీజైనింగ్ చేసి మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు ప్రాజెక్టులను కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశారు.
ప్రాణహిత నదీతీరంలో అరుదైన మూలికలు లభిస్తాయి. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 160 మిలియన్ సంవత్సరాల పూర్వకాలానికి చెందిన రాక్షస బల్లుల ఆనవాళ్లు లభించాయి. ఇప్పటికీ తెలంగాణలోని కోటపల్లి, వేమనపల్లి, నీల్వాయి, బొప్పారం, మహారాష్ట్రంలోని సిరంచ ప్రాంతంలో వృక్ష, జంతు శిలాజాలు లభ్యమవుతున్నాయి. ఇక్కడ దొరికిన శిలాజాల్లో నత్త గుల్లలు, చేపలు, తాబేళ్లతో పాటు వివిధ వృక్ష జాతులు ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వడదం లో మహారాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫాజిల్ పార్క్ ఏర్పాటు చేశారు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైపు ఆ వర్గం ఎందుకు ఆకర్షితులవుతోంది?
Recommended Videos