https://oktelugu.com/

Viral : ఇంట్లో పాము ఉందని ఫోన్ చేస్తే వచ్చిన స్నేక్ క్యాచర్ కే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది

రాను రాను జనాభా.. జనాల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకోసం అడవులను.. పొలాలను.. ఖాళీ స్థలాలను అనువుగా మలుచుకుంటున్నారు.దాంతో అక్కడ బతుకుతున్న ప్రాణులు దిక్కు తోచక ఇళ్లల్లోకి వస్తున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : February 13, 2025 / 06:01 PM IST
    Viral

    Viral

    Follow us on

    Viral : రాను రాను జనాభా.. జనాల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకోసం అడవులను.. పొలాలను.. ఖాళీ స్థలాలను అనువుగా మలుచుకుంటున్నారు.దాంతో అక్కడ బతుకుతున్న ప్రాణులు దిక్కు తోచక ఇళ్లల్లోకి వస్తున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. దీంతో అటు వన్య ప్రాణులకు.. ఇటు మనుషులకు! పైగా వానాకాలం.. పాముల వంటి సరిసృపాలు కలుగులు, బొరియల్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. అవి కళ్లు తెరిస్తే చుట్టు పచ్చదనం పోయి కాంక్రీట్‌ జంగిల్ కనిపిస్తుంది. దీంతో దిక్కు తోచక ఇళ్లల్లోకి జొరబడుతున్నాయి. ఇంటి పరిసరాల్లో పరిగెడుతున్నాయి. అవి కనిపించగానే మనం భయంతో గెంతులేస్తాం.. సాయం కోసం వెంటనే ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీకి ఫోన్‌ చేస్తాం! ఆ సొసైటీ వాలంటీర్స్‌ దాన్ని పట్టుకుని ఎక్కడో దూరంగా వదిలి పెడుతుంటారు. ఇలా పామును పట్టుకోవడం… విడిచిపెట్టడం ఈ మధ్య తరచూ జరుగుతుంది.

    ఆస్ట్రేలియాలోని ఓ స్నేక్ క్యాచర్ కు అలా వెళ్లినప్పుడు పెద్ద షాక్ తగిలింది. సిడ్నీలో పాములు రెస్క్యూ చేసేందుకు వెళ్లిన ఓ స్నేక్ క్యాచర్ బృందానికి అరుదైన దృశ్యం కనిపించింది. సిడ్నీకి పశ్చిమాన ఉన్న సబర్బన్ ప్రాంతమైన హార్స్లీ పార్క్ నివాసి తన ఇంటి వెనుక ఇంటి వెనుక భాగంలో ఆరు నల్ల పాములును చూసి స్థానికులు వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఆరు కాదు ఏకంగా 102 విషపూరిత పాములను ఒక కుప్ప కింద ఉండడం చూసి షాక్ అయ్యారు. సిడ్నీలోని రెప్టైల్ రిలొకేషన్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ఆరు పాములు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సాధారణ ఆపరేషన్ అని భావించారు. కానీ వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం మొదలు పెట్టిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

    “మేము అక్కడ ఉన్న ఓ చెత్త కుప్పను కదిలించాం. ఆ వెంటనే డజన్ల కొద్దీ పాములు మా కంటపడ్డాయి. మొదట 40, తరువాత 70, ఆపై 90 ఇలా వాటి సంఖ్య పెరుగుతూ పోయింది. ఆపరేషన్ పూర్తయ్యే సమయానికి మేము 102 పాములను గుర్తించాం. వాటిలో ఐదు పూర్తిగా ఎదిగినటువంటి ఆడ పాములు ఉండగా మిగతా 95 పాము పిల్లలు ఉన్నాయి” అని టీమ్‌లోని ఒక స్నేక్ క్యాచర్ తెలిపారు. అంత చిన్న స్థలంలో పదుల సంఖ్యలో పాములు ఉండడం గతంలో ఎప్పడూ చూడలేదని తెలిపారు.

    సూడెచిస్ పోర్ఫిరియాకస్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ పాములు ఆస్ట్రేలియాలో తరచుగా కనిపిస్తుంటాయి.దీని విషం సాధారణంగా మానవులకు ప్రాణాంతకం కాదు. అయితే దాని కాటు వల్ల తీవ్ర నొప్పి ఉంటుంది. కాటు వేసిన వారికి వికారం, వాంతులు, రక్తం గడ్డకట్టడం సమస్యలు, కండరాల బలహీనత, తిమ్మిరి ఉంటుంది. ఈ పాములు కాటు వేయండం కంటే తప్పించుకోవాడానికే ఎక్కువ ప్రయత్నిస్తాయని కొందరు జంతుజాల శాస్త్రవేత్తలు తెలిపారు. రెప్టైల్ రిలొకేషన్ సిడ్నీ టీమ్ 102 పాములను జాగ్రత్తగా సేకరించి, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ సిఫార్సులను ప్రకారం వాటిని అడవిలో వదిలిపెట్టారు.